
- కుమారుడి మృతి పై అనుమానం ఉందంటూ తండ్రి ఫిర్యాదు…!!
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఎస్సై భరత్ రెడ్డి….!!
క్రైమ్ మిర్రర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: నాన్న కళాశాలలో పరీక్షలు ఉన్నాయి వెళ్ళొస్తా… నా స్నేహితులతో బయటికి వెళ్లి వస్తానని హాస్టల్ మేట్ కి ఫోన్ చేసి చెప్పి బయటకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో ఓ వెంచర్ పక్కన ప్రభుత్వ భూమిలో శవమై కనిపించాడు. అసలు హత్యేనా…? లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా…? అనేది పోలీసుల నిర్ధారణలో తేలాల్సిఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన దాని ప్రకారం వికారాబాద్ జిల్లా, మండలం కొట్టాలగూడెం గ్రామానికి చెందిన మూడవత్ రాములు నాయక్ ఏకైక కుమారుడు శ్రీనివాస్ (22) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని జెబిఐటి కళాశాలలో మెకానికల్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు.
మహా శివరాత్రి పండుగ కోసం ఇంటికి వచ్చిన శ్రీనివాస్ పరీక్షలు ఉన్నాయని ఈ నెల మూడవ తేదీన కళాశాలకు వెళ్లి పోయాడు. నాలుగో తేదీ సాయంత్రం తన హాస్టల్ మెట్ సునీల్ కు ఫోన్ చేసి తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నన్నాడు. అదే రోజు తన తండ్రి రాముల నాయక్ కి కూడ ఫోన్ చేసి మాట్లాడాడని తెలిపారు. ఆ తర్వాత శ్రీనివాస్ ఫోన్ కలవకుండా పోయింది. కళాశాలలో ఉన్నాడని తల్లిదండ్రులు స్నేహితులతో ఉన్నాడని హాస్టల్ మెట్ అనుకోని ఉన్న సమయంలో 8వ తేదీ మంగళవారం రోజున వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం ఎల్లకొండ గేట్ ఎదురుగా సాయి ప్రియ వెంచర్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 398 సర్వేనెంబర్ లో బైక్ పై అనుమానాస్పదస్థితిలో పడి ఉన్నాడు.
అక్కడ పశువులు కపరులు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా తండ్రి రాములు నాయక్ తన కొడుకే అని గుర్తించి తన కుమారుడు మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మృతుడి తండ్రి రాములు నాయక్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ భరత్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి …
- నా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి సీఎంను చూడలేదు- మంత్రి ఎర్రబెల్లి
- కేసిఆర్ నియంత పాలనని తరిమి కొట్టాలి.. కాంగ్రెస్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి
- నిరుద్యోగులను నిలువునా మోసం చేసినా రాష్ట్ర బడ్జెట్..
- మంత్రిని ఎదిరించి కూతురు ప్రేమ వివాహం..
- నేనేవరికి భయపడను… కేసీఆర్ కు గవర్నర్ కౌంటర్
One Comment