
- ఆధారాలు చూపమని చైర్మన్ డిమాండ్, తోటి విలేకరుల సమాధానంతో సైలెంట్
- సమాచార హక్కు చట్టాన్ని కాలరాసే ప్రయత్నం
- ప్రశ్నించిన క్రైమ్ మిర్రర్ ప్రతినిధి గుటికీలు మింగిన చైర్మన్, సిఈఓ
క్రైమ్ మిర్రర్, నల్లగొండ నిఘా ప్రతినిధి : సహకార సంఘాల్లో స్వాహాకారం అనే క్రైమ్ మిర్రర్ కధనానికి స్పందిస్తూ,పిఎస్ సి ఎస్ చైర్మన్ మండల కేంద్రం లోని తమ కార్యాలయం నందు పలు వార్త పత్రికల విలేకరుల సమావేశం నిర్వహించారు.నేను తప్పు చేయలేదు అంటూ,ప్లేట్ తిప్పే ప్రయత్నం చేయబోయారు. ప్రభుత్వం నుండి హమాలి డబ్బులు రావని రైతే భరించాలంటూ, ప్రభుత్వం చెప్పిన విధంగా 34 రూపాయలకు హమాలీలు పనులకు రాకపోవటం వల్లే, ఆధనంగా కొంత డబ్బు వసూలు చేసి హమాలీలకే ఇచ్చామని సమాధానం ఇస్తూ, రిపోర్టర్ లను మభ్య పెట్టే ప్రయత్నం చేశారు.
ఈ సమావేశం లో క్రైమ్ మిర్రర్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు చైర్మన్,సీఈఓ గుటికీలు మింగారు.ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేయబోయారు.సహకార సంఘాలకు సమాచార హక్కు చట్టం వర్తించదంటూ సీఈఓ, చైర్మన్ చేసిన ప్రచారం అందరిని ఆలోచింపజేసింది. తప్పు చేయనప్పుడు పత్రాల దాపరికం ఎందుకని తోటి విలేకరులు అడుగగా,సమాచారం ఇస్తామని చెప్తూ దరఖాస్తు ఇచ్చిన రెండు రోజుల తరువాత సమావేశం లోనే రిసీవుడ్ కాపీ ఇచ్చారు.
ఈ సందర్బంగా పలు ఆరోపణల దృశ్యా చేసిన తప్పులపై సమాధానం అడుగగా పొంతన లేని సమాధానం తో తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం వ్యర్థమని తెలిసిపోయింది. ఆఫీస్ ముందు మట్టి కొట్టించి అరవై వేలు బిల్లు చేసి కార్యవర్గం తీర్మాణం తరువాత ఆరును సున్నా చేసి దాని ముందు ఒకటి పెట్టి లక్ష రూపాయలు ఎందుకు చేశారని, ప్రభుత్వం నుండి వచ్చిన గోనె బస్తాలు లెక్క లేకుండా పోతాయా అని అడుగగా తాత్కాలిక ఉద్యోగుల నుండి గోనె బస్తాలను రికవరీ చేపిస్తానని చెప్పారే తప్ప ఫోర్జరీ గురించి మారు మాట మాట్లాడలేదు. వడ్ల కోతలలో మాకు సంబంధం లేదని మిల్లుల దగ్గరే కోత విధించారని చెప్పారు.ఇవి కాకుండానే కొత్త అభియోగం తెర మీదికి వచ్చింది.
బ్యాంక్ ఖాతాదారుల నుండి ఖాతా ఓపెన్ చేయటానికి తీసుకునే డబ్బులు కాకుండానే 1000 రూపాయలు అదనంగా తీసుకొని బ్యాంక్ ఖాతా బుక్స్ ఇస్తున్నట్లు, ఇదేంటి అని అడిగిన వారికి నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనా తప్పు చేసే వారికి పెద్ద నాయకుల అండ ఉన్నందు వల్లే ఇంత వరకు వీరిపై చర్యలు తీసుకోవటం లేదని, అదే ఒక సామాన్యుడు తప్పు చేస్తే ఈ పాటికే అధికారుల హడావిడి అంబరాని అంటేవని మండల ప్రజానికం ఛీ కొడుతున్నారు.
ఇవి కూడా చదవండి ..
- ఆర్ధిక సహాయం అందచేత.. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ సుభాష్
- హత్యనా..! ప్రమాదమా..? వెళ్లోస్తానని కానరాని లోకాలకు కుమారుడు ..!!
- మంత్రిని ఎదిరించి కూతురు ప్రేమ వివాహం..
- నేనేవరికి భయపడను… కేసీఆర్ కు గవర్నర్ కౌంటర్
- పిల్లి కాటుకు ఇద్దరు మృతి… ఏపీలో షాకింగ్