
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తమిళనాడు మంత్రి శేఖర్ బాబు కూతురు జయ కళ్యాణి పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. సోమవారం బెంగళూరులో సతీశ్ అనే యువకుడితో మంత్రి కూతురు వివాహం జరిగింది. జయ కళ్యాణి, సతీశ్ లు హిందూ సంప్రదాయం ప్రకారం బెంగళూరులోని ఓ హిందూ ధార్మిక సంస్థలో వివాహం చేసుకున్నారు.అయితే పెళ్లి అయిన అనంతరం దంపతులు బెంగళూరు సిటీ కమిషన్ కార్యాలయానికి వెళ్లి.. తన తండ్రి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ కు వినతి పత్రం సమర్పించారు.
మంత్రి కూతురు ప్రేమ వివాహానికి హిందూ సంస్థలు మద్దతుగా నిలిచాయి. హిందూ కార్యకర్త భరత్ శెట్టి మాట్లాడుతూ… ఈ జంట వివాహం చేసుకోవడానికి సహాయం కోరుతూ సోషల్ మీడియాలో తమను సంప్రదించినట్లు చెప్పారు. దీంతో తాము హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుకను నిర్వహించామని, వారికి అమ్మాయి కుటుంబం నుండి ప్రాణహాని ఉందని, అందువల్ల వారు బెంగళూరు పోలీసులని భద్రత కోసం అభ్యర్థిస్తున్నారని ఆయన తెలిపారు
మంత్రి కూతురు జయకళ్యాణి మీడియాతో మాట్లాడుతూ…” నేను సతీశ్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఇవాళ మేము పెళ్లి చేసుకున్నాము. మాది ప్రేమ వివాహం. మా ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు. కొన్ని నెలల క్రితం నన్ను పెళ్లి చేసుకుంటానని సతీశ్ ముందుకు వచ్చారు. అయితే తమిళనాడు పోలీసులు ఆయనని రెండు నెలల పాటు అక్రమంగా నిర్బంధించారు. దీని వెనుక మా నాన్న పాత్ర ఉందని అనుమానం ఉంది. ఇప్పుడు మేము మేజర్లం. ఈ పెళ్లి మా ఇద్దరి సమ్మతి మీదనే జరిగింది. తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని మా తల్లిదండ్రులు బెదిరించారు. కాబట్టి మాకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నాను”అని తెలిపారు.
ఇవి కూడా చదవండి ..
- నేనేవరికి భయపడను… కేసీఆర్ కు గవర్నర్ కౌంటర్
- యూపీ మళ్లీ యోగీదే.. పంజాబ్ లో ఆప్ సర్కార్!
- ఏపీలో కొత్త సినిమా టికెట్ల ధరలు ఇవే!
- మెడికల్ కళాశాల ఏర్పాటు నిర్ణయం పట్ల పొంగులేటి హర్షం
- ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
4 Comments