
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళి సై మధ్య గ్యాప్ పెరిగిపోయింది. కొంత కాలంగా విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడంతో దుమారం రేపింది. తెలంగాణ సర్కార్ తీరుపై గుర్రుగా ఉన్నారు గవర్నర్ తమిళిసై. ఇప్పటికే తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్న ఆమె.. అత్యున్నత పదవిలో ఉన్నవారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక, నన్ను ఎవరూ భయపెట్టలేరని.. నేను దేనికీ భయపడను కూడా అని వ్యాఖ్యానించారు.
తమిళనాడు మహిళలకు, తెలంగాణ మహిళలకు తేడా ఏమిటని నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు.. కానీ, అందరూ ఒకేలా ఉంటారని చెప్పానని తెలిపారు గవర్నర్ తమిళిసై.. తెలంగాణ సోదరిగా నేను ఇక్కడ మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడతానన్న ఆమె.. మహిళలు ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలి, ఆనందాన్ని దేనికోసం కూడా వదులుకోకూడదని తెలిపారు.. అవకాశం చేజారినా బాధపడాల్సిన అవసరం లేదన్న ఆమె.. ఏదైనా సాధించాలన్న తపన ఎప్పుడు ఉండాలని సూచించారు..
ఇవి కూడా చదవండి …
- మంత్రిని ఎదిరించి కూతురు ప్రేమ వివాహం..
- యూపీ మళ్లీ యోగీదే.. పంజాబ్ లో ఆప్ సర్కార్!
- ఏపీలో కొత్త సినిమా టికెట్ల ధరలు ఇవే!
- మెడికల్ కళాశాల ఏర్పాటు నిర్ణయం పట్ల పొంగులేటి హర్షం
- ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
3 Comments