
- విద్యా రంగాన్ని విస్మరించిన బడ్జెట్: డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్
- డివైఎఫ్ఐ, ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో బడ్జెట్ ప్రతులు దగ్దం.
క్రైమ్ మిర్రర్, మిర్యాలగూడ: కొండంత రాగం తీసి పిచ్చి పాట పాడినట్లుగా రాష్ట్ర బడ్జెట్ కూడా అలాగే ఉందని , 2,56,958 కోట్ల బడ్జెట్ లో కూసింత కూడా ఉద్యోగాలు, భృతి గురుంచి ఊసు ఎత్తక పోవడం నిరుద్యోగులను నిండా మోసం చేయడమే అని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్ పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్ లు వస్తాయని ఊదరగొట్టి పబ్బం గడుపుకునే రాష్ట్ర ప్రభుత్వ సిగ్గులేని తనాన్ని ఈ బడ్జెట్ బట్టబయలు చేసిందని 60వేల ఖాళీల భర్తీ ఊసు లేదు. నోటిఫికేషన్ ఇస్తామనే భరోసా లేదు. ఆర్భాటంగా ఇస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి పలుకు కూడా లేదు. మొత్తంగా యువత హృదయాలను గాయపరిచే పద్దే తప్పా, నిండు ధైర్యం నిట్టనిలువుగా కూల్చే కురూపి బడ్జెటే ఇదని తెలిపారు.
ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ లకు ఒక్క పైసాకూడా కేటాయించకుండా నడిరోడ్డుమీద పడేసినట్లు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కు కేంద్ర మోడు తెడ్డు చూపిస్తే రాష్ట్రం డోకా ఇచ్చింది. కేంద్రం గతంలో 27కోట్ల 64లక్షల 35వేల నుండి 1 కోటి 13లక్షలు తగ్గించి చేతులు దులుపుకున్నాడు. రాష్ట్ర వాటా చిల్లి గవ్వ లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అంతకుముందు ఎన్నికల్లో పేజీ నెంబర్ 29లో నియోజకవర్గానికో మినీస్టేడియం అని, మండలానికో మల్టీ పర్పస్ గేమ్ సెంటర్ అని హామీ ఇచ్చి జబ్బలు చరుచుకున్నారు.
తప్పితే నయాపైసా పని కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పుడన్నా అవుద్దా అంటే అది కూడా కష్టమే అనిపిస్తుంది. యువజన సర్వీస్ , యువశక్తి అంశంలో స్పోర్ట్స్, యూత్ సర్వీసెస్ కింద గతం కంటే 4 కోట్లు పెంచారు కానీ గ్రౌండ్ లో ఏ మూలకు సరిపోవు. స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ కు 5 కోట్ల 64 లక్షల నుండి 23 కోట్ల 83లక్షల 91వేల కు పెంచి దాని ఉనికిని కాపాడారు. 117 నియోజకవర్గాల్లో స్పోర్ట్స్ కి డెవలప్మెంట్ కి గాని , గ్రౌండ్ ల పెంపుదలకు గాని ఏమి గొరకావని స్పష్టం చేశారు. రాష్ట్ర యూత్, స్టూడెంట్స్ గేమ్ పాలసీని నిర్ణయించలేదు. స్పోర్ట్స్ లో తెలంగాణ ఛాంపియన్ చేద్దామనే కించిత్ ఆలోచనా లేదు. ఎవడిదారిలో వాళ్ళు ఆడితే వ్యక్తి గత కృషి చేసి కప్పుకోడితే శాలువా కప్పి చప్పట్లు కొట్టి చల్లబుచ్చడం తప్పా ప్లేయర్స్ పెంపుదలకు , అభివృద్ధికి ముందు చూపు లేదు. మొత్తంగా యూత్ ని పట్టించుకోని, కొత్త కొలువుల్ని సృష్టించని, నిరుద్యోగుల్ని నిండా కూల్చిన, బలమైన విద్యార్థి యువతరాన్ని నిర్మించే సోయిలేని బడ్జెటని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పతని శ్రీను,జిల్లా నాయకులు వినోద్ నాయక్,నాగేంద్రప్రసాద్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు జగన్, నాయకులు వీరన్న, వంశీ, జ్యోతి, రమణ, శ్వేతా, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- కేసిఆర్ నియంత పాలనని తరిమి కొట్టాలి.. యువజన నాయకులు చంద్రకాంత్ రెడ్డి
- మంత్రిని ఎదిరించి కూతురు ప్రేమ వివాహం..
- నేనేవరికి భయపడను… కేసీఆర్ కు గవర్నర్ కౌంటర్
- యూపీ మళ్లీ యోగీదే.. పంజాబ్ లో ఆప్ సర్కార్!
- ఏపీలో కొత్త సినిమా టికెట్ల ధరలు ఇవే!