
- సమాజ నిర్మాణంలో మహిళల పాత్రే కీలకం- ఎమ్మెల్యే అరూరి
- మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు చైతన్యం కావాలి- డీసీసీబీ చైర్మన్
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ సీఎం కేసీఆర్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రిని నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం వర్దన్నపేట మండల కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్ లో నిర్వహించిన వర్దన్నపేట నియోజకవర్గ మహిళా దినోత్సవ వేడుకలకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను మంత్రి ఎర్రబెల్లితో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పంపిణీ చేశారు. అనంతరం నిత్యం ప్రజాహితం కోసం పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పారిశుద్ద్య కార్మికులు, అంగన్వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మహిళలంటే సీఎం కేసీఆర్‌కు అపార గౌరవమని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సాధికారత కోసం గొప్పగా కృషి చేస్తున్నారని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆడబిడ్డ పెండ్లికి లక్షా నూటపదహారు రూపాయలు కానుకగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఆడబిడ్డ కాన్పు కోసం కేసీఆర్ కిట్టు, ఆడపిల్ల జన్మిస్తే రూ.13వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ.12 వేలు అందిస్తున్నామని, ఈ ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.
”రైతే రాజు అన్నోల్లే కానీ రైతు సంక్షేమం కోసం పాటు పడ్డ సీఎంలను నేను ఇంత వరకు చూడలేదన్నారు. నా 40 ఎండ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ లా రైతుల బాగు, సంక్షేమం కోసం పని చేసిన సీఎంలు రాలేదని. అనుకున్నది చేసే పట్టుదల ఉన్న మనిషి కేసీఆర్” అని అన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. సాగునీటి కోసం కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ స్కీంలతో కేసీఆర్ తెలంగాణ పాలిట అపర భగీరథడు అయ్యారని ప్రశంసించారు.
సాగునీటితో తెలంగాణని కోటి ఎకరాల మాగాణి చేశారన్నారు. 24గంటల పాటు ఉచిత విద్యుత్, రైతుబంధు, రుణ మాఫీ, రైతు వేదిక, రైతు బీమాలకు భారీగా నిధులు కేటాయించారన్నారు. విమర్శలకు తావులేదు, విమర్శించే వాళ్ళకు విలువే లేదన్నారు. రైతు సంక్షేమాన్ని వ్యతిరేకించేవాళ్ళు ప్రజాసేవకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనేకసార్లుగా బలపరుస్తూనే ఉన్నారన్నారు.
అనంతరం ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో మహిళలే కీలకమని ఎమ్మెల్యే అరూరి అన్నారు. మహిళలకు, బాలికలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందించి మహిళల కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, అంగన్ వాడీలకు సైతం దేశంలోనే అత్యధిక వేతనాలు కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు.
సీఎం కేసిఆర్ నాయకత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖలో అద్భుతమైన పథకాలు అమలు జరుగుతున్నాయని, మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఒకరోజు సరిపోదని, మూడు రోజుల పాటు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ మూడు రోజులుగా అనేక వేదికల్లో మహిళలను సన్మానించామన్నారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు తెలియజెప్పి, వారందరినీ భాగస్వామ్యం చేసేందుకు ఈ మూడు రోజుల వేడుకలు చేశామని ఎమ్మెల్యే అరూరి తెలిపారు.
అనంతరం డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు గౌరవం దక్కుతున్నదని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు, కేసీఆర్ కిట్లు ఏ రాష్ట్రంలోనూ లేవని వెల్లడించారు. మహిళల రక్షణ, భద్రతకు పూర్తి స్థాయి అవకాశాలున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఆడపిల్లపుడితే బాధపడే స్ధాయి నుంచి ఆనందపడే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పధకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు.
కేసీఆర్ కిట్ ద్వారా మాతా శిశువుల మరణాలు తగ్గడంతో పాటు ప్రభుత్వ అస్పత్రులలో ప్రసవాల రేటు గణనీయంగా పెరిగిందని తెలిపారు. బాలికల విద్యను పెంపొందించే విధంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి వారికి నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. షీ-టీం వ్వవస్ద ద్వారా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నదని, వి-హబ్ ద్వారా ఎందరో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ ఎల్లావుల లలితా యాదవ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, స్వయం సహాయక సంఘాలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పారిశుద్ద్య కార్మికులు, మహిళా ఉద్యోగులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
3 Comments