
- ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్- వాణి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు
- అలరించిన పలువురు సినీనటులు, సింగర్స్
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: నేలమ్మను ‘భూమాతగా’ కొలుచుకునే మమకారం తెలంగాణది.. నీటిని గంగమ్మలా పిలుచుకునే సంస్కారం తెలంగాణది.. ఆవును గోమాతగా పూజించే ఆచారం తెలంగాణది.. పూలను బతుకమ్మగా పూజించే సంస్కారం తెలంగాణ సొంతమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం వరంగల్ లోని ఖుష్ మహల్ వద్ద మహిళా దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ -వాణీల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సినీనటులు, సింగర్స్ ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ సేవలందించిన మహిళా కార్పొరేటర్లను ఎమ్మెల్యే దంపతులు ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నీరు లేక నోరెండిన చోట నీళ్ళు పుట్టించిండు.. ఆడభిడ్డలు భిందెలతో మైళ్ళు నడిచే తిప్పలు తప్పించిండు.. భగీరథ సంకల్పంతో ఆడభిడ్డ ఇంటిలోకే గంగమ్మను తీసుకువచ్చి మిషన్ భగీరథుడైండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆడబిడ్డ ఎదిగితే పేదింట పెళ్ళి భారమవుతున్న తరుణంలో, ఆడబిడ్డపెళ్ళి భారం కాదు భాద్యత అని చాటుతూ ఆ ఇంటి తండ్రి గుండె బరువును తగ్గిస్తూ లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్ సాయంతో మేనమామ తానై 10,27,000 పైచిలుకు పెళ్ళిల్లకు సాయం అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ప్రశంసించారు. పిల్లలు పుడితే కుల్ల కుట్టిస్తం.. ఆ కుల్ల కూడా కుట్టించాలంటే డబ్బులెల్లని ధీనగాదలు కొన్ని పేద కుటుంబాలవి.. ఆ గాధలు తీర్చుతూ ఆడబిడ్డ మురిపాన్ని తీర్చుతూ కేసీఆర్ కిట్ తో ధనవంతులు సైతం వాడని వస్తువులను పేద పిల్లలకు తల్లులకు అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సుమారు 10,83,447 కిట్లను ప్రభుత్వం అందజేసిందని, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు చొప్పున వారికి అందజేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తుచేశారు. తల్లి, బిడ్డా బాగుండాలని డెలివరీ రూమ్స్ ను అభివృద్ది చేసి, కొత్తగా శిశు సంరక్షణా కేంద్రాలు, పిల్లల ప్రాణాలు కాపాడేందుకు ఐసీయూల ఏర్పాటు చేసింది సీఎం కేసీఆరేనని గుర్తుచేశారు. డెలివరి అయ్యాక ఇంటికెల్లేందుకు ఆటో ఖర్చులకు డబ్బులు లేక కాలినడకన బాలింతలు నడిచిన ఘటనలు సమైక్య రాష్ట్రంలో ఎన్నో కళ్ళముందు కదలాడినయ్.. కానీ ఆ గోసను తీర్చుతూ అమ్మ ఒడి ద్వారా ప్రభుత్వమే తల్లి పిల్లను క్షేమంగా ఇంటికి చేర్చేలా చర్యలు తీసుకోవటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళల పట్ల ఉన్న భాద్యతకు నిదర్శనమన్నారు.
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకి అన్న రోజుల నుండి, నేను సర్కారు దవాఖానాకే వెల్తా అనేంతలా ప్రభుత్వం కృషిచేసిందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రసవానికెల్తే ఆపరేషన్ తప్ప ఇంకో ఆప్షన్ లేదని, తల్లీ బిడ్డా ఆరోగ్యం ఇబ్బంది అయ్యేదని అన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరిచి ఆసుపత్రులను అభివృద్ది చేసి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలంటే జనంలో నమ్మకం పెంచేలా చేసింది సీఎం కేసీఆర్ అని, అందుకు నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ప్రసవాల సంఖ్యనే నిదర్శనమని గుర్తుచేశారు. సన్నబియ్యం బువ్వ.. సక్కనైన సదువు.. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ఆడపిల్లలకోసం రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచిత నిర్బంద విద్యను అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు. నేడు ఈ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సాంఘీక సంక్షేమ పాఠశాలల్లో 1,02,057 మంది విద్యార్థిణులకు నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. నేడు అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాదిస్తున్నారని.. ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని.. మహిళలు మరింత ఎత్తుకు ఎదగి, స్త్రీ శక్తిని చాటాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం చేపడుతున్న గొప్ప కార్యక్రమాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా చేసిందన్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలు సంతోషంగా గడపాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
One Comment