
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, కల్వకుర్తి : కేసీఆర్ నియంత పరిపాలనగా, రాష్ట్రంలోని ప్రజా సమస్యలను శాసనసభలో ప్రస్తావించకుండా ప్రతిపక్ష నాయకులను సస్పెండ్ చేయడం, కెసిఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనం పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష శాసనసభ్యుల పైన స్పీకర్ వైఖరికి నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పరిపాలనగా, రాష్ట్రంలోని ప్రజా సమస్యలను శాసనసభలో ప్రస్తావించకుండా ప్రతిపక్ష నాయకులను సస్పెండ్ చేయడం, కెసిఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగబద్దమైన తెలంగాణ శాసనసభను దుర్యోధన సభగా మార్చడం జరిగిందని విమర్శించారు.
రాష్ట్రంలో నిరుద్యోగులకు , అమరవీరుల కుటుంబాలకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడంపై మండిపడ్డారు. ఇప్పటికైనా బడ్జెట్ సవరణలో నిరుద్యోగులకు , అమరవీర కుటుంబాలకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి యాదవ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బీస బాలరాజు, పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్, అసెంబ్లీ కార్యదర్శి జంగయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు, ఎన్ఎస్ యూ ఐ నాయకులు జర్పుల శ్రీను నాయక్, నాయకులు మిర్యాల దామోదర్ రెడ్డి, సాబేర్, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీకాంత్, వంశీ, శివ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- మంత్రిని ఎదిరించి కూతురు ప్రేమ వివాహం..
- నేనేవరికి భయపడను… కేసీఆర్ కు గవర్నర్ కౌంటర్
- యూపీ మళ్లీ యోగీదే.. పంజాబ్ లో ఆప్ సర్కార్!
- ఏపీలో కొత్త సినిమా టికెట్ల ధరలు ఇవే!
- మెడికల్ కళాశాల ఏర్పాటు నిర్ణయం పట్ల పొంగులేటి హర్షం