
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : మర్రిగూడ మండలం బట్లపెళ్లి గ్రామానికి చెందిన ఆవుల గణేష్ వయస్సు 29 సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం రోజున పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సంతోష, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఇతని పెద్ద కూతురు ఫ్లోరోసిస్ బాధితురాలు, హాస్పిటల్లో వైద్యపరీక్షలు చేయించి అప్పులపాలైన అతని కూతురు గత సంవత్సరం మరణించింది.
ఆర్ధికంగా నలిగి పోయాడు. ఇతని తండ్రి కూడా ఆవుల రాములు ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుడు. బట్ల పల్లి గ్రామం ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ కలిగిన గ్రామము ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఫ్లోరోసిస్ వ్యాధి గురైన వారే ఎక్కువగా ఉన్నారు.
ఇట్టి విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం, తెలియజేస్తూ 10 వేల రూపాయల ఆర్థిక సహాయం ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ గారి ద్వారా కుటుంబానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ నాయకులు మహేశ్వరం సతీష్, జిల్లా నాయకులు ఈద రాములు, ఆవుల యాదయ్య, భాస్కర్, భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- హత్యనా..! ప్రమాదమా..? వెళ్లోస్తానని కానరాని లోకాలకు కుమారుడు ..!!
- 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి సీఎంను చూడలేదు- మంత్రి ఎర్రబెల్లి
- కేసిఆర్ నియంత పాలనని తరిమి కొట్టాలి.. కాంగ్రెస్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి
- మంత్రిని ఎదిరించి కూతురు ప్రేమ వివాహం..
- నేనేవరికి భయపడను… కేసీఆర్ కు గవర్నర్ కౌంటర్
One Comment