
క్రైమ్ మిర్రర్, కావాలి : వైకాపా ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాలేపాటి సుబ్బా నాయుడు తెలిపారు. కావలి డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు, పట్టణ టిడిపి అధ్యక్షులు గ్రంధీి యానాది శెట్టి, టిడిపి నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గం లో శాంతిభద్రతలు చేయి దాటి పోయేయని దానికి ఉదాహరణగా పట్టణంలోని లే అవుట్ లో గుర్తు తెలియని ఒక మహిళను గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి దహనం చేశారని విమర్శించారు.
మహిళా దినోత్సవం ముందు రోజు ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని తెలియజేశారు. దీనిపై పోలీసులు విచారించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో రక్త సంబంధీకులకు కూడా న్యాయం జరగడం లేదని విమర్శించారు. పదవులే ముఖ్యం గా భావిస్తున్నారని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం లేదని తెలియజేశారు. అట్రాసిటి కేసులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని త్వరలో చరమగీతం పాడుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- ఐదు రాష్ట్రాల ఎగ్డిట్ పోల్స్… దేశ వ్యాప్తంగా ఆసక్తి
- నాలుగు కాళ్లతో కోడిపిల్ల జననం.. బ్రహ్మంగారి మాట నిజమైందంటున్న జనం
- డీజిల్ అంటూ నీళ్ల అమ్మకం.. రంగారెడ్డి జిల్లా పెట్రోల్ బంకులో ఘరానా మోసం
- పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. మెట్రో ప్రయాణాలపై భారం
- పిల్లి కాటుకు ఇద్దరు మృతి… ఏపీలో షాకింగ్
One Comment