
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఉత్తర్ప్రదేశ్లో మరోసారి అధికారం బీజేపీదేనని తేల్చాయి సర్వే సంస్థలు, గతంలో కంటే కొన్ని సీట్లు తగ్గినప్పటికీ ఆ రాష్ట్రంలో కమలదళానికి మెజారిటీకి మించి సీట్లు వస్తాయని లెక్క కట్టాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం దక్కనుందని పోల్స్ స్వష్టం చేశాయి. మణిపుర్లో బీజేపీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషించాయి. ఉత్తరాఖండ్, గోవాలో హోరాహోరీగా పోరు ఉండనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని తెలిపింది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్‌ఎల్‌డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది. కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 10 స్థానాలకు పరిమితం కానుంది. గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి బీజేపీ 90 సీట్లు కోల్పోయే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ, మిత్రపక్షాలకు కలిపి 38 శాతం ఓట్లు.. సమాజ్‌వాదీ పార్టీ కూటమికి 35 శాతం, బీఎస్‌పీకి 16 శాతం, కాంగ్రెస్ 7 శాతం, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది.
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ప్రభంజనం సృష్టించనుందని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్.. కేజ్రీవాల్ పార్టీకే పట్టం కట్టాయి. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్లో మెజారిటీకి 59 స్థానాలు అవసరం కాగా.. ఆప్ అంతకుముంచి సీట్లను గెలుచుకోనుందని పోల్స్ వెల్లడించాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రెండో స్థానంలో ఉంది. బీజేపీకి కనిష్ఠంగా ఒకటి, గరిష్ఠంగా ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఏబీపీ-సీఓటర్ అంచనాల ప్రకారం బీజేపీకి 26-32 స్థానాలు రానుండగా.. కాంగ్రెస్కు 32 నుంచి 38 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మెజారిటీకి 36 స్థానాలు అవసరం.టైమ్స్ నౌ- వీటో అంచనాల ప్రకారం ఉత్తరాఖండ్లో బీజేపీకి 37 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకోనుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46.5 శాతం, కాంగ్రెస్ 33.5 శాతం ఓట్లు సాధించాయి. బీఎస్పీ 7 శాతం ఓట్లు సాధించాయి. తాజా ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నప్పటికీ ఈసారి ఆప్ కూడా రంగంలోకి దిగడంతో రసవత్తరంగా మారింది.
ఇవి కూడా చదవండి ..
- ఏపీలో కొత్త సినిమా టికెట్ల ధరలు ఇవే!
- మెడికల్ కళాశాల ఏర్పాటు నిర్ణయం పట్ల పొంగులేటి హర్షం
- ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
- వైకాపా ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు.. మాలేపాటి సుబ్బానాయుడు
- ఐదు రాష్ట్రాల ఎగ్డిట్ పోల్స్… దేశ వ్యాప్తంగా ఆసక్తి
- నాలుగు కాళ్లతో కోడిపిల్ల జననం.. బ్రహ్మంగారి మాట నిజమైందంటున్న జనం
3 Comments