
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సాధారణంగా కోడికి రెండు కాళ్లు ఉంటాయి.. కానీ ఇక్కడ కోడిపిల్ల నాలుగు కాళ్లతో జన్మించింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో కలియుగంలో అనేక వింతలూ విశేషాలు జరుగుతాయని చెప్పిన విషయం ఇప్పటికీ కథలు కథలుగా చెప్పాకుంటారు జనం. మేకకు మనిషి రూపంలో పిల్ల, ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వడం, కుక్క పిల్లి స్నేహం వింత సంఘటనలు గురించి తరచుగా వింటూనే ఉన్నాం. తాజాగా జనగాం జిల్లా దేవరుప్పుల మండలంలో ఈ వింత ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
మండలంలోని కొత్తవాడ కాలనీలో శివరాత్రి వెంకటయ్య అనే వ్యక్తి ఇంట్లో ఓ కోడి వింత పిల్లకు జన్మనిచ్చింది. గ్రామస్థులు నాలుగు కాళ్ల కోడిపిల్లను ఆసక్తిగా చూస్తున్నారు. ఈ విషయం చుట్టు పక్కల తెలిసి జనం తరలి వెళుతున్నారు. ఆ తల్లి కోడి మొత్తం 12 పిల్లల్ని పొదిగింది. అందులో ఓ కోడిపిల్ల ఇలా వింతగా జన్మించింది అయితే ఈ కోడిపిల్ల ఆరోగ్యంగానే ఉన్నట్లు ఇంటి యజమాని తెలిపారు. ఇది బ్రహ్మం గారి మాటల సత్యాలే అని కొందరంటుంటే.. మరికొందరు మాత్రం ఇది జెనెటిక్ లోపం వల్ల జరిగి ఉంటుందని వాదిస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- ఐదు రాష్ట్రాల ఎగ్డిట్ పోల్స్… దేశ వ్యాప్తంగా ఆసక్తి
- నాలుగు కాళ్లతో కోడిపిల్ల జననం.. బ్రహ్మంగారి మాట నిజమైందంటున్న జనం
- డీజిల్ అంటూ నీళ్ల అమ్మకం.. రంగారెడ్డి జిల్లా పెట్రోల్ బంకులో ఘరానా మోసం
- పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. మెట్రో ప్రయాణాలపై భారం
- పిల్లి కాటుకు ఇద్దరు మృతి… ఏపీలో షాకింగ్
2 Comments