
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. . రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు మరింత పెరిగిపోయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయిల్ ధరలు తారా స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వాహనదారులు మరింత కలవరపడుతున్నారు. అయితే ధరలతో అల్లాడిపోతున్న జనాలను మరో రకంగా మోసం చేస్తున్నాయి పెట్రోల్ బంక్ యాజమాన్యాలు. రంగారెడ్డి జిల్లాలోలని ఓ పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా డీజిల్ బదులు నీళ్లు అమ్మేస్తున్నారు. ఎక్కువ శాతం నీళ్లే ఉన్న ఆ డీజిల్ కొట్టించుకున్న వాహనాలు బంకు దాటేలోపే ఆగిపోయాయి. దీంతో వాహనదారులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ శివారులో విజయవాడ హైవే మార్గంలోని పెద్ద అంబర్‌పేట్‌లో గల ఓ పెట్రోల్ బంక్‌లో డీజిల్‌కు బదులుగా నీళ్లు పోయడం కలకలం రేపింది. ఆ బంక్‌లో డీజిల్ పోయించుకున్న వాహనాలు వరుసగా ఆగిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు తనిఖీ చేసి డీజిల్ కల్తీ అయినట్లు గుర్తించి బంకును సీజ్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మలక్‌పేట్ సర్వీస్ స్టేషన్ పెట్రోల్ బంక్‌లో ఆదివారం ఉదయం వాహనదారుడైన బాబురావు రూ. 4 వేలతో తన కారులో డీజిల్ కొట్టించారు. కారు కాస్త ముందుకు వెళ్లిందో లేదో.. బంక్ పక్కనే ఇంజన్ ఆగిపోయింది. ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో అనుమానం వచ్చి డీజిల్ తనిఖీ చేయించారు. అందులో డీజిల్‌కు బదులు నీరు ఉంది. ఈలోపే మరో వాహనదారుడు మాధవరావు తన కారులో 36 లీటర్ల డీజిల్ పోయించుకున్నారు. ఆయన కారు కూడా బంకు దాటకుండానే ఆగిపోయింది. ఇలా దాదాపు ఆరుగురు బంక్ వద్దకు చేరుకుని యజమానితో వాగ్వాదానికి దిగారు.
ఇవి కూడా చదవండి ..
- ఐదు రాష్ట్రాల ఎగ్డిట్ పోల్స్… దేశ వ్యాప్తంగా ఆసక్తి
- నాలుగు కాళ్లతో కోడిపిల్ల జననం.. బ్రహ్మంగారి మాట నిజమైందంటున్న జనం
- పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. మెట్రో ప్రయాణాలపై భారం
- పిల్లి కాటుకు ఇద్దరు మృతి… ఏపీలో షాకింగ్