
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లిక్కర్ రేట్లను స్వల్పంతా తగ్గించనుంది. ఈ దిశగా రాష్ట్ర ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత.. కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశముంది. భారత్‌లో తయారయ్యే మద్యం (IML) బాటిళ్లపై ధరను తగ్గించనన్నట్లు తెలుస్తోంది. ధరలు తగ్గించడం ద్వారా అమ్మకాలు పెంచాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఐతే బీరు రేట్ల తగ్గడం లేదని తెలిసింది. ఇప్పుడున్న ధరలనే కొనసాగించనున్నట్లు సమాచారం.
తెలంగాణలో 2,620 వైన్ షాపులతో పాటుబ వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లు ఉన్నాయి. 2020 మే నెలలో కరోనా సెస్ పేరుతో 20 శాతం వరకు మద్యం ధరలను పెంచింది ప్రభుత్వం. అన్ని రాష్ట్రాల్లో రేట్లు పెంచారు. కానీ పరిస్థితులు చక్కబడిన తర్వాత తగ్గించారు. తెలంగాణలో మాత్రం ఇంకా తగ్గించలేదు.ధరల పెరుగుదల కారనంగా బీర్ల అమ్మకాలు తగ్గడంతో.. బీర్ రేటును ఇప్పటికే తగ్గించిన విషయం తెలిసిందే. ఒక్కో సీసాపై రూ.10 తగ్గించారు. కానీ భారత్‌లో తయారైన మద్యం ధరలు మాత్రం అలాగే ఉన్నాయి.
పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయి. అధిక ధరల కారణంగా గతంతో పోల్చితే ఆదాయం పెరిగింది.కానీ అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఈ నేపథ్యంలో ధరలను తగ్గించి అమ్మకాలను పెంచాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. మద్యం ధరలను ఎంత తగ్గిస్తే.. ఎంత ఆదాయం వస్తుందన్న లెక్కలు వేశారు. అనంతరం ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.10 తగ్గించాలని నిర్ణయించనున్నట్లు తెలిసింది. క్వార్టర్, హాఫ్, ఫుల్ అనే తేడా లేకుంటే అన్నింటిపైనా రూ.10 తగ్గించనున్నట్లు సమాచారం.
ధరల తగ్గింపుపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనికి ఆమోదం తెలిపితే.. కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి దాకా రూ. 28 వేల కోట్ల దాకా అమ్మకాలు జరిగాయి. మొత్తంగా రూ.30వేల కోట్లు వచ్చే అవకాశముంది. ఐతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 33 వేల కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి ..
- సహకార లీలలు..! – విధులు గాలికి… నిధులు జేబుకి
- ధరణి కష్టాలు కేసీఆర్ పాపమే- మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
- కోడికూర వండలేదని చెల్లెను చంపేసిన అన్న!
- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం..
- నాలుగు రోజుల్లో 60 లక్షల చలానాలు క్లియర్..
One Comment