
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పాము కాటుకు, కొన్నిసార్లు కుక్కకాటుకు గురై జనాలు చనిపోవడం చూసుంటాం. కానీ పిల్లి కరిచి చనిపోవడం మాత్రం చాలా అరుదుగా జరుగుతోంది. అలాంటి ఓ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పిల్లికాటుకు గురై ఇద్దరు మహిళలు ఒకే రోజు మృత్యువాతపడ్డారు. ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే..ఇద్దరి మహిళల్ని బలితీసుకున్న ఆ పిల్లి..కుక్కకాటుకు బలైంది.
కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడ దళితవాడ కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమల (64), అదే కాలనీలో ఉంటున్న ఆర్‌ఎంపీ వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణి (43)లను రెండు నెలల కిందట ఓ పిల్లి కరిచింది. అప్పట్లో ఆ మహిళలిద్దరూ వైద్యుల సలహా మేరకు టీటీ ఇంజెక్షన్ చేయించుకుని మందులు వాడారు. కొద్దిరోజులకు ఉపశమనం కలగడంతో యథావిధిగా తమ పనులు చేసుకోసాగారు.
అయితే నాలుగు రోజుల క్రితం మళ్లీ ఇద్దరికి అనారోగ్యం తిరగబెట్టింది. కమలను మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చేర్పించగా.. నాగమణి శుక్రవారం విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. నాగమణి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. కమల కూడా శనివారం ఉదయం10 గంటలకు చనిపోయింది. వారిద్దరికీ పిల్లి కరవడంతో ఇద్దరికీ ర్యాబిస్ సోకిందని వైద్యులు చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఆ ఇద్దరు మహిళలను కరిచిన పిల్లి కుక్కకాటుకు బలైంది.
ఇవి కూడా చదవండి ..
- కేసీఆర్ ఫ్రంట్ కు డైరెక్టర్ పికే, ప్రొడ్యూసర్ పిఎం మోడీ.. నటుడు కేసీఆర్
- మందు బాబులకు కిక్కె కిక్కు.. లిక్కర్ రేట్లను స్వల్పంతా తగ్గించనుంది.
- ధరణి కష్టాలు కేసీఆర్ పాపమే- మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
- కోడికూర వండలేదని చెల్లెను చంపేసిన అన్న!
- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం..