
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అయితే, కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉండబోదని స్పష్టం చేశారు. ఏదేమైనా మరో ఫ్రంట్‌పై చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. అయితే, మీడియా చిట్‌చాట్‌లో టి.పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్ ఫ్రంట్ సినిమాకు డైరెక్టర్ (ప్రశాంత్ కిషోర్) పీకే, ప్రొడ్యూసర్ నరేంద్ర మోడీ నటుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ కుటుంబ పాలనకు వ్యతిరేకం కాదు. కుటుంబ దోపిడీకి వ్యతిరేకం అన్నారు. వైఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు అసోం అధికారులు ఉన్నారు. ఐఏఎస్‌లు బీపీ ఆచార్యలు, శ్రీలక్ష్మిలు అవుతారన్న మా పోరాటం సీఎంపైనే.. కానీ, అధికారుల మీద కాదన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ రీజినల్ పార్టీ కాదన్న మధుయాష్కీ. అవినీతిలో ఆంధ్ర.. బీహార్ అధికారి అని ఉండదు.. తెలంగాణ ఐఏఎస్ లకు పదవులు ఇచ్చేది సీఎం కదా..? అని ప్రశ్నించారు. ఒక్కో అధికారికి అన్ని శాఖలు ఇచ్చిన సీఎంది తప్పన్న ఆయన. కేసీఆర్‌ని నేను దొర లెక్క చూస్తానన్నారు. ఇక, డీజీపీ మహేందర్ రెడ్డి… కిరణ్ కుమార్ రెడ్డి, ఐఏఎస్ శ్రీధర్ లు అత్యంత సన్నిహితులన్నారు యాష్కీ.
ఇప్పుడు కేసీఆర్‌కి సన్నిహితులుగా మారారని.. ఐఏఎస్ ల కోసం కాదు… ఉద్యోగాల ఖాళీల గురించి కొట్లాడాలన్నారు.. తెలంగాణకు ద్రోహం చేస్తుంది కేసీఆరేనని మండిపడ్డ ఆయన.. అధికారుల గురించి ఎందుకు.. నిరుద్యోగుల కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత.. ఆంధ్రోళ్లు అంతా ఇక్కడే ఉన్నారు. సినిమాలు.. స్టూడియోలు అన్నీ వాళ్ల దగ్గరే ఉన్నాయని గుర్తు చేశారు. ఇక, భట్టి విక్రమార్క లెక్క గ్రామ గ్రామం తిరగాలని.. అప్పుడే పార్టీకి బలం చేకూరుతుందన్నారు. ప్రచార కమిటీ తరుపున నియోజక వర్గం వారీగా అజెండా సిద్ధం చేస్తాం.. త్వరలో ప్రచార కమిటీ జిల్లా, నియోజక వర్గ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు మధు యాష్కీ గౌడ్.
ఇవి కూడా చదవండి ..
- ధరణి కష్టాలు కేసీఆర్ పాపమే- మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
- కోడికూర వండలేదని చెల్లెను చంపేసిన అన్న!
- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం..
- నాలుగు రోజుల్లో 60 లక్షల చలానాలు క్లియర్..
- సహకార లీలలు..! – విధులు గాలికి… నిధులు జేబుకి
2 Comments