
క్రైమ్ మిర్రర్, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. సమావేశం అనంతరం అసెంబ్లీకి హాజరు కాకూడదని ప్రకటించనుంది టీడీఎల్పీ. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై టీడీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
మెజార్టీ ఎమ్మెల్యేలు మాత్రం బాబు లేకుండా వెళ్లిన లాభం లేదని భావించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 తేదీనుంచి జరగనున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ… బడ్జెట్ కూర్పు ఏ విధంగా ఉంటుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే టీడీపీ మాత్రం ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించడం హాట్ టాపిక్ అవుతోంది. గతంలో శాసన సభలో బాబును అవమానించారని టీడీపీ గుర్రుగా వుంది. తిరిగి సీఎంగానే అసెంబ్లీకి వస్తానంటూ చంద్రబాబునాయుడు శపథం చేశారు. దీంతో బాబు లేకుండా ఎమ్మెల్యేలు వెళ్లాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు.
Read More : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం..
Sahakara Bank : సహకార లీలలు..! – విధులు గాలికి… నిధులు జేబుకి
ఇటీవల జరిగిన పొలిట్ బ్యూరోలో ఈ అంశంపై చర్చించారు. దీంతో ఈ అంశంపై క్లారిటీ వచ్చిందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రకటన చేసిన రోజునే ఇకపై ఎన్నికలయ్యేంత వరకు టీడీపీ అసెంబ్లీకి రాదని.. చాలామంది డిసైడ్ అయిపోయారని అందుకే సభకు దూరంగా వుండి ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- కేసీఆర్ ఫ్రంట్ కు డైరెక్టర్ పికే, ప్రొడ్యూసర్ పిఎం మోడీ.. నటుడు కేసీఆర్
- మందు బాబులకు కిక్కె కిక్కు.. లిక్కర్ రేట్లను స్వల్పంతా తగ్గించనుంది.
- ధరణి కష్టాలు కేసీఆర్ పాపమే- మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
- కోడికూర వండలేదని చెల్లెను చంపేసిన అన్న!
- నాలుగు రోజుల్లో 60 లక్షల చలానాలు క్లియర్..
- శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర నిజమేనా? అసలు నిజాలు ఇవేనా?