
- సహకార సంఘాల్లో స్వాహాకారం!
- అవినీతి మయమైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం
- కార్యవర్గ సభలు సూన్యం, అవినీతి గోరం
- నెంబర్లను సున్నాలు చేసి ప్రభుత్వ సొమ్ముకు కన్నం.!
- ఆర్టిఐ కి అనుమతి లేదు, అడిగే వారు లేరు.
క్రైమ్ మిర్రర్, నల్లగొండ నిఘా ప్రతినిధి : జిల్లాలోని మర్రిగూడ మండలం నందు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి అవినీతి మరక అలుముకుంది. అడిగే వారు లేక, అడిగినా ఫలితం లేక, జరుగుతున్న తతంగాని చూస్తూ కూర్చున్నారు. ఎన్నుకున్న ప్రజానికం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సంఘాల ద్వారా రైతులకు చేస్తున్న మేలు కొందరికే సొంతమైపోతుంది. డైరెక్టర్ల జాడ లేక, కార్యవర్గ సమావేశాలు లేక సంఘం వెలవెల బోతుందని, వారి అనుమతి లేకుండానే సొసైటీ డబ్బు మాయమైపోతుందని ఆరోపణలతో పాటు, రైతుల నుండి కొన్న వడ్ల లో తరుగు పేరుతో కోతలు విధించారనే వార్తలు వినబడుతున్నాయి.
దాదాపు 506 క్వింటాల వడ్లు లెక్కలో లేకుండా పోయాయని, తరుగు పేరుతో మోసం చేయటం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి వచ్చిన గోనె సంచులతో సహా స్వాహా అయినట్లు, తరుగు పేరుతో లక్షలో సొమ్ము కూడబెట్టుకున్నట్లు మండల వ్యాప్తంగా వినికిడి. అంతే కాకుండా ప్రభుత్వం నుండి వచ్చే హమాలి కూలీ కాకుండా, అదనంగా రైతుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు, ప్రభుత్వం చెల్లించిన కూలీలో కూడా షేర్ లు ఉన్నాయని, ఇద్దంతా చైర్మన్ కనుసన్నలో నడిచినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read More : పది ఎకరాల సైట్, కోట్లలో సుపారీ… రియాల్టర్ల హత్య కేసులో సినిమాటిక్ ట్విస్ట్ లు
ఈ మధ్య కాలంలో కార్యాలయం ముందు మొరం మట్టి కోసం కార్యవర్గం నుండి అరవై వేలకు తీర్మాణాలు తీసుకున్న ఛైర్మెన్ మరలా తీర్మాణాని దిద్ది ఒక లక్ష రూపాయలకు బిల్లు చేసుకున్నాడని, ఇదేంటి అని ప్రశ్నించిన డైరెక్టర్ లపై విరుచుకు పడుతున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ అవినీతి బాగోతాల మీద డైరెక్టర్ లు కలిసి ఉన్నత అధికారులకు పిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
భారత పౌరుని ప్రాధమిక హక్కుల ద్వారా సంక్రమించిన సమాచార హక్కు చట్టంనికి ఈ సంఘానికి ( పి.ఎ.సి.ఎస్ )కు సంబంధం లేదంటూ, ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదనే విదంగా రైతులను తప్పుదారి పట్టించి సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్పుకు తిరుగుతున్నట్లు తెలుస్తుంది. రైతుకు వెన్ను దండుగా నిలవాల్సిన వారే అవినీతి చేస్తూ, ప్రజలను పీడిస్తూ ఉంటే ఉన్నత అధికారుల నిఘా ఎంత వరకు సొంతమో తెలుస్తుందని ప్రజలు అంటున్నారు. వెంటనే సంబంధిత ఉన్నత అధికారులు వడ్ల కొనుగోలు, అభివృద్ధి కార్యక్రమాల బిల్స్ పై విచారణ చేపట్టాలని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
- శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర నిజమేనా? అసలు నిజాలు ఇవేనా?
- బహుజనుల రాజ్యాధికారం బియస్ పి తోనే సాధ్యం
- ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో ఆరుగురి అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు..
- రావిర్యాల లో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
- యూపీ ఎన్నికల్లో బీజేపీకి మరో అస్త్రం.. ‘ఉక్రెయిన్’ నినాదమెత్తుకున్న నేతలు..!
3 Comments