
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : ట్రాఫిక్ పెండింగ్ చాలన్ల వసూలుకు తెలంగాణ పోలీసులు శ్రీకారం చుట్టడడంతో వాటిని చెల్లించేందుకు వాహనదారుల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. దీంతో నాలుగు రోజుల్లోనే కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి చేకూరింది. మార్చి ఒకటి నుండి ప్రారంభమైన చాలానా వసూలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు 60 లక్షల చలానాలు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దాదాపుగా 55 కోట్ల రూపాయల జరిమానాలు వసూలయినట్టు పోలీసులు తెలిపారు. చలాన్లు మొదలైన మార్చి 1న 8 లక్షలు, రెండవ తేదిన 15 లక్షలు, 3న 16 లక్షల , 4న 20 లక్షల చలానాలు వాహనదారులు చెల్లించినట్టు అధికారులు తెలిపారు.
Read More : పది ఎకరాల సైట్, కోట్లలో సుపారీ… రియాల్టర్ల హత్య కేసులో సినిమాటిక్ ట్విస్ట్ లు
తెలంగాణ వ్యాప్తంగా గడిచిన నాలుగేళ్లలో 6.19 కోట్ల మేర వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఈ కేసుల్లో నమోదైన జరిమానాల్లో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వసూలయ్యాయి. మిగతా జరిమానాల కోసం పోలీసు శాఖ ఇప్పుడు రాయితీలు ప్రకటించింది. ద్విచక్రవాహనదారులు 75 శాతం రాయితీతో ఈ-లోక్ అదాలత్ లో చలానాలను క్లియర్ చేసుకోవచ్చు. అంటే ద్విచక్ర వాహనంపై రూ.1000 జరిమానా పెండింగ్ లో ఉంటే రాయితీ పోగా రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి రూ.35 సర్వీస్ చార్జి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు ఎలాంటి పడిగాపులు, క్యూలైన్లు, అవసరం లేకుండా తమ జరిమానాలను ఈ-చలానాల వెబ్‌సైట్ లోనే పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేలా పోలీసు శాఖ పోర్టల్‌ను అప్‌డేట్ చేస్తోంది. ఈ అప్ డేట్ సాఫ్ట్ వేర్ మార్చి1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులోకి ఉండనుంది ఈ వెబ్‌సైట్’ను ఉపయోగించి చలానాలను చెల్లించవచ్చు. (https://echallan.tspolice.gov.in/publicview)
ఇవి కూడా చదవండి…
- సహకార లీలలు..! – విధులు గాలికి… నిధులు జేబుకి
- శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర నిజమేనా? అసలు నిజాలు ఇవేనా?
- ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో ఆరుగురి అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు..
- రావిర్యాల లో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
One Comment