
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశంలో నాల్గవ అతిపెద్ద రాజధాని చెన్నై నగరానికి తొలి ఎస్సీ మహిళ మేయర్ గా ప్రియా రాజన్. చెన్నై కార్పోరేషన్ కు ఓ ఎస్సీ మహిళ మేయర్ కావడం ఇదే తొలిసారి. డీఎంకే పార్టీ తరుపున గెలిచిన ప్రియారాజన్ తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల చెన్నై కార్పోరేషన్ మేయర్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించడంతో ప్రియా రాజన్ కు కలిసి వచ్చింది. ఇటీవల చెన్నై కార్పోరేషన్ కు నిర్వహించిన ఎన్నికల్లో 153 వార్డులను కైవసం చేసుకుని మెజారిటీ సాధించింది.
Read More : నాలుగు రోజుల్లో 60 లక్షల చలానాలు క్లియర్..
దాదాపు 340 ఏళ్ల తరువాత చెన్నై నగరానికి దళిత అభ్యర్థి మేయర్ ఎన్నికైన తొలి దళిత అభ్యర్థిగా ప్రియా రాజన్ రికార్డు సృష్టించారు. ఇదిలా ఉంటే చెన్నైకి ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు మాత్రమే మేయర్ పదవిని చేపట్టారు. 1957లో తారా సెరియన్ అనే మహిళ తొలిసారి చెన్నై కార్పొరేషన్‌కు మేయర్‌గా కాగా… 1971-72 మధ్య కామాచ్చి జయరామన్.. ఈ పదవిని చేపట్టిన రెండో మహిళగా నిలిచారు. ప్రస్తుతం ప్రియా రాజన్ చెన్నై కార్పొరేషన్ మూడో మహిళా మేయర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి ..
- కాంగ్రెస్ కు 40 లక్షల ఏకే 47లు?
- సహకార లీలలు..! – విధులు గాలికి… నిధులు జేబుకి
- శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర నిజమేనా? అసలు నిజాలు ఇవేనా?
- ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో ఆరుగురి అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు..
One Comment