
క్రైమ్ మిర్రర్, వాజేడు : బహుజనుల రాజ్యాధికారం బియస్ పి పార్టీతోనే సాధ్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఎస్ పి పార్టీ ఇన్చార్జ్ నాన్నమాద్రి కృష్ణఅర్జున్ రావు అన్నారు.గురువారం వాజేడు మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ రాజ్య స్థాపన కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్య ,వైద్యం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆర్ఎస్ పి ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బహుజన రాజ్యాధికారం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
గ్రామలలో ప్రతి ఇంటికి ఏనుగు గుర్తును పరిచయం చేయడంలో ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. బిఎస్ పి పార్టీ భద్రాచలం నియోజకవర్గం కార్యదర్శిగా కుమ్మరి రాంబాబును, సోషల్ మీడియా భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జిగా జనగాం కేశవరావును నియమించినట్లు భద్రాచలం బీఎస్పీ అధ్యక్షుడు పూనెం ముఖేష్ తెలిపారు. అలాగే వాజేడు మండలంలో సెక్టార్లకు సంబంధించిన కన్వీనర్, కో కన్వీనర్ లను నియమించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా బిఎస్ పి ఉపాధ్యక్షుడు వ్యాసం సిద్ధార్థ పూలే, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి తడికల శివకుమార్, వాజేడు మండల బిఎస్ పి అధ్యక్షుడు తిప్పన పల్లి అనంత్, ఉపాధ్యక్షుడు చెన్నం శ్రీను, వాజేడు సెక్టార్ అధ్యక్షుడు బలుసుపాటీ రాజు, ఉపాధ్యక్షుడు లేగల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో ఆరుగురి అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు..
- రావిర్యాల లో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
- యూపీ ఎన్నికల్లో బీజేపీకి మరో అస్త్రం.. ‘ఉక్రెయిన్’ నినాదమెత్తుకున్న నేతలు..!
- పది ఎకరాల సైట్, కోట్లలో సుపారీ… రియాల్టర్ల హత్య కేసులో సినిమాటిక్ ట్విస్ట్ లు
- అమ్మో ఆర్టీసీ దొంగ..!! – రూ. 40 వేల విలువైన వస్తువుల చోరీ…!!
vmBbwiuCOrqe