
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో గత రెండు రోజులక్రితం ఇద్దరు రియల్టర్లపై తుపాకీ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు రియల్టర్లు శ్రీనివాసరెడ్డి, రాఘవేందర్ రెడ్డి చనిపోయారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. పరారీలో మరో ఇద్దరు ఉన్నారన్నారు.
నగరంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. మార్చి 1న ఇబ్రహీంపట్నంలో కాల్పులు జరిగాయని తమకు ఫిర్యాదు వచ్చిందన్నారు. రియల్ ఎస్టేట్ శ్రీనివాస్ రెడ్డి స్పాట్‌లో చనిపోయాడన్నారు. మరో రియల్ ఎస్టేట్ వ్యాపారీ రాఘవేందర్ రెడ్డి హాస్పిటల్‌లో మృతి చెందాడన్నారు. లేక్ వ్యూ వెంచర్ ఫ్లాట్స్ గొడవలో ఈ కాల్పులు జరిగాయని తెలిసిందన్నారు. సైంటిఫిక్ ఆధారాలతో, సీసీ ఫుటేజ్, సీడీఆర్ అనాలిసిస్‌తో కేసును ఛేదించామన్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు.
Read More : ఇబ్రహీంపట్నంలో రియల్టర్ల పై… పక్కా ప్రణాళికతో కాల్పులు
ఈ కేసులో ప్రధాన నిందితుడు మట్టా రెడ్డి అలియాస్ భిక్షపతి కీలక నిందితుడని ఆయన తెలిపారు. గెస్ట్‌హౌస్‌లో పనిచేస్తున్న మోహినిద్దున్ ఈ కేసులో మరో కీలక నిందితుడన్నారు. సయ్యద్ రహిమ్, సమీర్ అలీ బీహార్, రాజు ఖాన్ బీహార్, ఫైర్ ఆమ్స్ వాడారని తెలిపారు. భిక్షపతి, ఖాజా మోహినిద్దున్ కాల్పులు జరిపారన్నారు. ఈ కేసులో రెండు వేపన్స్‌ను సీజ్ చేసామన్నారు. కంట్రీ మెడ్ పిస్టోల్స్ 19 రౌండ్స్, బుల్లెట్ వాహనం, హోండా అమేజ్ కార్, 6 సెల్‌ఫోన్స్, డాక్యుమెంట్లు సీజ్ చేసామని సీపీ తెలిపారు.
మట్టారెడ్డి, మోహినుద్దీన్, బిక్షపతి, రహీమ్, సమీర్, రాజు ఖాన్‌లను అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరు బీహార్ రాష్ట్రానికి చెందిన చందన్ సిబాన్, సోనులు పరారీలో ఉన్నారన్నారు. మోహినుద్దీన్, బిక్షపతి ఇద్దరు కాల్పులు జరిపారని ఆయన పేర్కొన్నారు. నిందితుల నుంచి రెండు కంట్రీ మెడ్ పిస్టల్స్, కారు, 6 సెల్‌ఫోన్లు, మట్టా రెడ్డికి సంబందించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రియల్ ఎస్టేట్ తగాదాలతోనే మొదటిసారి కాల్పుల ఘటన జరిగిందన్నారు. మట్టారెడ్డిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయన్నారు. మట్టారెడ్డి అలియాస్ అశోక్ రెడ్డికి పలు పేర్లు ఉన్నాయన్నారు. జోతిష్యుడి సలహాతో తన పేరును మట్టారెడ్డి మార్చుకున్నాడన్నారు. లేక్ విలా లే అవుట్‌లో శ్రీనివాస్ , రాఘవ 14 ఎకరాలు కొన్నారన్నారు. మట్టారెడ్డికి శ్రీనివాస్, రాఘవలు పలుమార్లు బెదిరింపులు వచ్చాయన్నారు. బీహార్‌కు చెందిన వారితో 20 రోజుల క్రితం మట్టారెడ్డి డీల్ కుదుర్చుకున్నాడన్నారు. ఫిబ్రవరి 20న కాల్పులకు అటెంప్ట్ చేశారన్నారు. మార్చి 1న మాట్లాడుదాం రమ్మని మట్టా రెడ్డి చెప్పాడని ఆయన పేర్కొన్నారు. ఇంటి నుంచి వస్తున్న శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డిలను మొహినుద్దీన్ లిఫ్ట్ అడిగాడన్నారు.
Realtor : పది ఎకరాల సైట్, కోట్లలో సుపారీ… రియాల్టర్ల హత్య కేసులో సినిమాటిక్ ట్విస్ట్ లు
డ్రైవింగ్ సీట్‌లో ఉన్న శ్రీనివాస్ రెడ్డిపై మొదట కాల్పులు జరిపారన్నారు. శ్రీనివాస్ రెడ్డి ని ఛేస్ చేస్తూ బిక్షపతి కాల్పులు జరిపారన్నారు. రాఘవ రెడ్డిపై మోహినుదీన్ కాల్పులు జరిపాడన్నారు. కాల్పుల తరువాత బిక్షపతి, మోహినుద్దెన్ ఒక గెస్ట్ హౌస్‌కు వెళ్లి తుపాకీ దాచి పెట్టారని ఆయన పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి సొంత గ్రామానికి వెళ్లారని ఆయన తెలిపారు. రూ.1.20 లక్షల సుపారిని డీల్‌ను మట్టారెడ్డి కుదుర్చుకున్నాడన్నారు. మట్టారెడ్డి గెస్ట్ హౌస్‌లో ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో మోహినుద్దెన్ పరిగెత్తుకుంటూ వచ్చిన ఫుటేజ్ కీలకంగా మారిందన్నారు. శ్రీనివాస్, రాఘవలను చంపేస్తే మొహినుద్దెన్, బిక్షపతిలకు లేక్ వీలాలో ప్లాట్‌లు ఇప్పిస్తా అని డీల్ కుదుర్చుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ కేసులో పోలీసులకు మట్టారెడ్డి అసలు సహకరించలేదని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఈ కేసును త్వరగా ఛేదించిన ఎస్వోటి డీసీపీ మురళీధర్, ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి,సైదులు, రాములు ,సుధాకర్ తో పాటు మిగితా పొలీస్ సిబ్బంది ని అభినందించారు..
పోలీసులకు దృశ్యం సినిమా చూపించిన మట్టారెడ్డి
హత్య జరిగిన రోజు ఘటన స్థలంలో ఉన్న మట్టారెడ్డిపై మృతుల కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడంతో వెంటనే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణకు ఏమ్రాతం సహకరించలేదని సీపీ తెలిపారు. తమ మధ్య చంపుకొనేంత విభేదాలు లేవని పదే పదే వ్యాఖ్యానించినట్లు చెప్పారు. విచారణలో మట్టారెడ్డికి ఫామ్ హౌస్ ఉందని విషయం పోలీసులకు తెలిసింది. దాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులకు.. ఫామ్‌హౌస్‌లో సీసీ కెమెరా కనిపించింది. ఫుటేజ్‌ను పరిశీలించగా.. హత్య జరిగిన అనంతరం పచ్చ చొక్కా వేసుకున్న వ్యక్తి ఫామ్ హౌస్‌లోకి హడావుడిగా రావటం కనిపించింది. ఆ వ్యక్తిని ఆరా తీయగా.. శ్రీనివాస్ రెడ్డిపై కాల్పులు జరిపిన ఖాజా మోహియుద్దీన్ అని తేలింది.
ఇవి కూడా చదవండి ..
- రావిర్యాల లో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
- యూపీ ఎన్నికల్లో బీజేపీకి మరో అస్త్రం.. ‘ఉక్రెయిన్’ నినాదమెత్తుకున్న నేతలు..!
- అమ్మో ఆర్టీసీ దొంగ..!! – రూ. 40 వేల విలువైన వస్తువుల చోరీ…!!
- భారీ చోరీ కి పాల్పడిన నిందితుడూ అరెస్ట్..
- సీఎం జగన్ మెడకు వివేక హత్య కేసు?
One Comment