
క్రైమ్ మిర్రర్, అమరావతి డెస్క్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్యను రాజకీయంగా వాడుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధిపొందారని దివంగత వివేకా కుమార్తె డాక్టర్ సునీత వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ ఎదుట ఆమె 2020 జులై 7న ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఆ వాంగ్మూలంలో సునీత పలు కీలక విషయాలు వెల్లడించారు. . ‘మా నాన్నను ఎవరు చంపారో పులివెందులతో చాలా మందికి తెలుసు. హంతకులెవరో తేల్చాలని అన్నను కోరా. హంతకులు వారే అయి ఉండొచ్చంటూ అన్న అంటూ కొందరి పేర్లు ప్రస్తావించా. దానికి ఆయన ఇచ్చిన సమాధానం తనను ఆశ్చర్యపరిచిందని సునీత అన్నారు. తాను చెప్పిన వారిని అనవసరంగా అనుమానించొద్దని జగన్ అన్నారని పేర్కొన్నారు. చివరికి తన భర్తే తన తండ్రిని చంపించి ఉండొచ్చని అనడంతో తన గుండె పగిలిపోయిందని ఆమె తెలిపారు. తన తండ్రి హత్య గురించి ఫోన్ చేసి చెబితే ‘అవునా’ అంటూ జగన్, భారతి చాలా తేలిగ్గా తీసుకున్నారని సునీత చెప్పారు.
సీబీఐతో దర్యాప్తు చేయించాలని తాను కోరితే.. జగన్ బదులిస్తూ.. సీబీఐతో దర్యాప్తు చేయిస్తే ఏమవుతుంది?.. అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతాడని, అతడికేమీ కాదని అన్నారని సునీత సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పటికే ఉన్న 11 కేసులకు మరొకటి తోడవుతుంది తప్పితే ఒరిగేదేమీ ఉండదని జగన్ చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందని సునీత అన్నారు. అనుమానితుల జాబితాలో ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్ ఉదయ్ కుమార్రెడ్డి పేరు చేర్చడంపైనా జగన్ తనపై ఆగ్రహం వ్యక్తంచేశారని అన్నారు. సొంత చిన్నాన్న ప్రాణం కన్నా కాంపౌండరే ఆయనకు ఎక్కువ అయ్యారని సునీత పేర్కొన్నారు. తన తండ్రి చనిపోయిన విషయం తెలిసి సంబరాలు చేసుకునేందుకు బాణసంచా కొనుగోలు చేసిన వ్యక్తిని ఎలా వదిలిపెట్టారో తనకు అర్థం కావడం లేదన్నారు.
Read More : జగన్ కు షాక్.. బెజవాడలో కేసీఆర్ క్రేజ్
తనకు న్యాయం లభించదన్న ఉద్దేశంతోనే సీబీఐ విచారణకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివేకా కుమార్తె డాక్టర్ సునీత స్పష్టం చేశారు. తన తండ్రిపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి రాజకీయ కక్ష పెంచుకున్నారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. హత్య విషయాన్ని ముందుగా భారతికి, ఆ తర్వాత జగన్ కు ఫోన్ చేసి చెబితే.. అవునా..? అంటూ చాలా తేలిగ్గా స్పందించారని, వారి మాటల్లో ఏ కొంచెమైనా బాధ కనిపించలేదని అన్నారు.
Mandamarri : ఐదు లక్షల పొగాకు ఉత్పత్తులు స్వాధీనం.. టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి
‘2019 మార్చి 15న ఉదయం ఐదున్నరకు నా భర్త రాజశేఖర్ రెడ్డికి పులివెందుల నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కంగారుగా మాట్లాడుతుంటే.. నేను, మా అమ్మ గమనించాం. అడగ్గానే మీ నాన్న చనిపోయారని చెప్పారు. ఉదయం ఏడున్నరకు టీవీ వార్తల్లో గుండెపోటుపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నా భర్తకు ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్ చేసి, కేసు పెట్టమంటారా.. అని అడిగాడు. అదే సమయంలో మా తండ్రి సహాయకుడు ఇనయతుల్లా వాట్సాప్ నుంచి ఫొటోలు వచ్చాయి. వాటిని నా భర్తకు చూపించా. రక్తంతో పాటు తలపై గాయాలు చూస్తే అమ్మ భయపడుతుందని మాట్లాడకుండా నా భర్తకు చూపించా. కారులో కూర్చున్న మా అమ్మ ఎర్ర గంగిరెడ్డికి ఫోన్ చేయమంటే.. ఎన్నిసార్లు చేసిన ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి మేం పులివెందుల వచ్చే వరకు పోస్టుమార్టం చేయొద్దని చెప్పా. మా బంధువు అభిషేక్ రెడ్డికి ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాం. అయినప్పటికీ కాసేపటి తర్వాత ఫోన్ చేసి పోస్టుమార్టం పూర్తయిందని, కుట్లువేసి కుట్టేశారని చెప్పారని డాక్టర్ సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
నేర ఘటనా స్థలంలో ఆధారాలను కూడా ధ్వంసం చేశారని తెలిసిందన్నారు. నాన్నకు సన్నిహితుడైన ఎంవీ కృష్ణారెడ్డితో కేసు పెట్టించొద్దని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడని అనడంతో హత్య జరిగిందని తాను నిర్ధారించుకున్నానని సునీత చెప్పారు. ‘వెంటనే సీఐ శంకరయ్యకు నా భర్త ఫోన్ చేసి కేసు నమోదు చేయమని చెప్పారు. నాన్న హత్య గురించి తెలిసినా పులివెందులలో ఉన్న అనుమానితులు అంత్యక్రియలు ఆ రోజే అయిపోవాలని హడావుడి చేశారు. శంకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు భరత్ యాదవ్ కు ఈ హత్య గురించి మొత్తం తెలుసు’ అని సునీత చెప్పారు.
Ysrcp : కేసీఆర్ ఫోటోలు చించేయించిన జగన్!
తన తండ్రి హంతకులను శిక్షించాలని.. జగనన్నను.. సజ్జల, సవాంగ్ తదితరుల సమక్షంలో బతిమాలినట్టు సునీత గుర్తు చేసుకున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అనుమానితుల జాబితాలో చేర్చడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. ఎంవీ కృష్ణారెడ్డి (వివేకా పీఏ) ద్వారా నీ భర్త రాజశేఖర్ రెడ్డే హత్య చేయించాడని ఎందుకు అనుకోకూడదని అనడంతో జగన్ తో వాగ్వివాదానికి దిగానని సునీత చెప్పారు. తనకు తెలిసినంత వరకు.. భరత్ యాదవ్, సునీల్ యాదవ్ తో కలిసి 104 కోట్ల రూపాయల వ్యవహారాన్ని తన తండ్రి సెటిల్ చేశారని, అందులో తన తండ్రికి 4 కోట్ల రూపాయలు వచ్చాయని అన్నారు. అందులో భరత్, సునీల్ వాటా డిమాండ్ చేస్తే కోటిన్నర రూపాయలకు ఎక్కువ ఇవ్వనని తేల్చి చెప్పారని, తన తండ్రి హత్యకు బహుశా ఇది కూడా ఓ కారణం అయి ఉంటుందని సునీత అన్నారు.
తన తండ్రి వివేకా, పెదనాన్న రాజశేఖరరెడ్డికి ఉమ్మడిగా ఉన్న 600 ఎకరాలను జగన్, షర్మిల, తనకు సమానంగా తలా 200 ఎకరాలు పంచారని, ఆ తర్వాత ఎకరం లక్ష చొప్పున తన నుంచి ఆ ఆస్తిని వెనక్కి తీసుకున్నారని సునీత చెప్పారు. అవినాష్ తో తన భర్త కుమ్మక్కయినట్టు వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదని, ఆస్తి మొత్తానికి తానే వారసురాలినని డాక్టర్ సునీత చెప్పారు.
ఇవి కూడా చదవండి ..
- జూన్ లో కొవిడ్ ఫోర్త్ వేవ్… మహమ్మారి పీడ ఇప్పట్లో పోదా..!
- అర్ధరాత్రి.. బస్సు వెనక సీటులో మహిళపై డ్రైవర్ అత్యాచారం!
- కాంగ్రెస్ టికెట్లపై రేవంత్ రెడ్డి సంచలనం..
- అర్ధరాత్రి.. బస్సు వెనక సీటులో మహిళపై డ్రైవర్ అత్యాచారం!
- కారెక్కనున్న పీకే.. తెలంగాణలో సంచలనం?
2 Comments