
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికలకు ఇంకో 20 నెలల గడువున్నా అప్పుడే పార్టీలు దూకుడు పెంచాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. దీంతో రోజురోజుకు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. తాజాగా ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే… తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవడం సంచలనంగా మారింది. కొంత కాలంగా గులాబీ బాస్ గా సన్నిహితంగా కొనసాగుతోన్న నటుడు ప్రకాశ్ రాజ్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. నటుడు ప్రకాశ్ రాజ్ శని, ఆదివారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయన వెంట ప్రశాంత్ కిషోర్ కూడా మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించారు.
టీఆర్ఎస్ కోసం పీకే పనిచేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పీకే టీమ్ సర్వే చేస్తోదంని కేసీఆర్ పార్టీ నేతలు చెప్పారని తెలిసింది. ఇప్పుడు పీకే బాహాటంగానే తిరుగుతుండటంతో టీఆర్ఎస్ కోసంతన మొదలుపెట్టారని చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొంత కాలం కిందటే కేంద్రంపై, ప్రధాని మోదీపై యుద్దం ప్రకటించారు. బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో విపక్షాల ఏకీకరణకు నడుం బిగించారు. అందులో భాగంగానే కేసీఆర్ ఇటీవల ముంబై వెళ్లారు. గతంలో చెన్నై పర్యటించారు. త్వరలో బెంగళూరు వెళతారని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో విపక్షాల ఏకీకరణ, బీజేపీపై ఉమ్మడి పోరు విషయంలో ప్రశాంత్ కిషోర్ సలహాలను కేసీఆర్ తీసుకుంటున్నారని చెబుతున్నారు.
పీకేకే జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలున్నాయి. ప్రాంతీయ పార్టీల నేతలతోనూ ఆయన పని చేశారు. ఏపీ సీఎంగా జగన్ గెలవడంతో పీకే కీలక పాత్ర. గతంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కోసం పని చేశారు. 2020లో జరిగిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి మమత మరోసారి ముఖ్యమంత్రి కావడానికి పీకే వ్యూహాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. గతంలో పంజాబ్ లో అమరీందర్ సింగ్ కోసం వర్క్ చేశారు. యూపీలో అఖిలేష్ కు కొన్ని సంవత్సరాలు అడ్వైజర్ గా ఉన్నారు పీకే. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల కోసం పీకే తనకు అవసరమని కేసీఆర్ భావించారని తెలుస్తోంది. అందుకోసమే పీకే హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ తో సమావేశం అయ్యారని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రకాష్ రాజ్ కు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ వెంట ప్రకాష్ రాజ్ ఉన్నారని తెలుస్తోంది.
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యర్థి కాంగ్రెస్ అనుకుంటే, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్-బీజేపీ ప్రత్యర్తులు. ఢిల్లీ స్థాయిలో బీజేపీపై కాంగ్రెస్ కూడా పోరాడుతోంది. కాంగ్రెస్ పార్టీతో అధికారం పంచుకుంటూ లేదా యూపీఏ కూటమిలో కొనసాగుతోన్న స్టాలిన్, తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ యాదవ్ లు కాంగ్రెసేతర కూటమిలో చేరబోమని దాదాపు స్పష్టం చేసిన దరిమిలా.. ఆ విషయంలో పీకే వాదన కూడా భిన్నంగా ఉన్న క్రమంలో కనీసం అసెంబ్లీ ఎన్నికల వరకైనా కేసీఆర్ ఇక జాతీయ రాజకీయ అంశాల్లో ఎలా వ్యవహరిస్తారనేది ఉత్కంఠ రేపుతున్న అంశం.
ఇవి కూడా చదవండి ..
- కాంగ్రెస్ టికెట్లపై రేవంత్ రెడ్డి సంచలనం..
- జగ్గారెడ్డితో కలిసి కోమటిరెడ్డి జంప్?
- ఉక్రెయిన్ కు మన విద్యార్థులు ఎందుకు వెళుతున్నారో తెలుసా?
- ఐదు లక్షల పొగాకు ఉత్పత్తులు స్వాధీనం.. టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి
One Comment