
- దళిత బాంధవుడు సీఎం కేసీఆర్
- 70 ఏండ్లలో జరగని అభివృద్దిని చేసి చూపిస్తున్నాం
–ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: దళితులందరికి ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు, 100 యూనిట్ల ఉచిత కరెంట్, ఎస్సీ సబ్ ప్లాన్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ లాంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందజేస్తున్న సందర్బంగా 18, 19, 20, 21 డివిజన్లకు చెందిన ఎస్సీ, ఎస్టీలకు లేబర్ కాలనీ లోని సీబీసి చర్చ్ పక్కన నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులందరికి ఆర్థిక స్వాలంభన కోసం దళిత బంధు, 100 యూనిట్ల ఉచిత కరెంట్, ఎస్సీ సబ్ ప్లాన్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ లాంటి అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. దళితులు, బహుజనులు ఆర్థిక పరిపుష్టి సాధించాలని రాష్ట్రంలో అనేక సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. ఈ 100 యూనిట్ల ఉచిత కరెంట్ ను లబ్దిదారులకు అందేవిధంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ప్రతీ ప్రజా ప్రతినిధి ఈ కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్దతో పాల్గొనాలని అన్నారు. 100 యూనిట్ల ఉచిత కరెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. దళిత బందు కార్యక్రమం ప్రతీ ఒక్కరికీ అందేవరకూ కొనసాగుతుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ విడతల వారిగా దళిత బంధు అందజేస్తారని తెలిపారు. ప్రతీ దళిత కుటుంబానికి దళితబంధు అందే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్రమించరన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. సీబీసీ చర్చ్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. పేదల ఎదుగుదలే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశయమని.. వారి అడుగుజాడల్లోనే పేద ప్రజల కోసం కృషి చేస్తున్నానని.. ప్రజల జీవితాల మార్పుకోసమే పాటుపడుతున్నానని అన్నారు.
గుడిసెవాసులకు పట్టా అందజేస్తున్నాం.. ఒక్క అవకాశం ఇస్తే 10 వేల కుటుంబాలను సొంత ఇంటి హక్కుదారులను చేస్తున్నాను.. ఒక్క అవకాశం ఇస్తే రూ.3వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నాం.. అతి పెద్ద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. ఐదేళ్లకోసారి కనబడే నాయకులను నమ్మొద్దని, ఎన్నికలప్పుడు వచ్చే నాయకులతో ఒరిగేదేం లేదని..పేద ప్రజల బాగు కోసం చాలా ఓపికగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్దే నా ప్రధాన థ్యేయమని.. గతంలో ఎన్నడూ లేని అభివృద్దిని చేసి చూపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వస్కుల బాబు, గుండేటి నరేంద్రకుమార్, ఓని స్వర్ణలత భాస్కర్, ఎండి ఫుర్ఖాన్, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, టీఆర్ఎస్ ముఖ్యనాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
- కేసీఆర్ పేదింటి యువతులకు మేనమామలా మారారు- మంత్రి ఎర్రబెల్లి
- వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్?
- దొంగతనం కేసులో నిందితుడికి జైలు శిక్ష