
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హాలియా నియోజకవర్గంలో ట్రైనింగ్ చాపర్ కుప్పకూలింది. పెదవూర మండలం తుంగతుర్తి సమీపంలో రామన్నగూడెం తండా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళా శిక్షణ పైలెట్ మృతి చెందారు. మృతురాలిని తమిళనాడుకు చెందిన మహిమగా గుర్తించామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి చెప్పారు. సింగల్ సీటర్ చాపర్ ప్రమాదానికి గురైందన్నారు. ఈ చాపర్‌ను నాగార్జున సాగర్‌లోని విజయపురిసౌత్ ఏవియేషన్ అకాడమీకి చెందినదని ఆమె వెల్లడించారు. విషయం తెలుసుకున్న అకాడమీ అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
Read More : రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది?
వ్యవసాయ పొలాల్లో చాపర్ కూలినప్పుడు భారీ శబ్దంతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. భయాందోళనకు గురైన స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. అప్పటికే ప్రమాదానికి గురైన చాపర్ ముక్కలవగా.. పైలెట్ మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, రెవెన్యూ, వైద్య సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇది సాగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్నట్లు కన్పించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఘటనాస్థలానికి సమీపంలోనే 133కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలున్నాయి. చాపర్ ఈ తీగలపై కూలి ఉంటే ప్రమాదం మరింత తీవ్ర స్థాయిలో ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి ..
- జగన్ కు షాక్.. బెజవాడలో కేసీఆర్ క్రేజ్
- పేదల జీవితాలు మార్చినప్పుడే మాకు నిజమైన సంతృప్తి
- కేసీఆర్ పేదింటి యువతులకు మేనమామలా మారారు- మంత్రి ఎర్రబెల్లి
- వైసీపీ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్ ?
2 Comments