
క్రైమ్ మిర్రర్, అమరావతి డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ టార్గెట్ గా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. తమ పవర్ స్టార్ సినిమా భీమ్లానాయక్ సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో తెగ హంగామా చేస్తున్నారు. ఏపీలో టికెట్ రేట్ల ధరలు పెంచడం ఆలస్యం చేసినా.. రెవెన్యూ అధికారులతో బెదిరింపులకు దిగినా.. అవేవీ భీమ్లా నాయక్ జోరును అడ్డుకోలేకపోయాయి. థియేటర్లలో దుమ్ము రేపుతున్నాయి.
భీమ్లానాయక్ కు ఏపీ సర్కార్ బ్రేకులు వేసే ప్రయత్నం చేయగా.. తెలంగాణ సీఎం మాత్రం టాలీవుడ్ పెద్దలు అడిగినవన్నీ చేసేశారు. టికెట్ రేట్లు భారీగా పెంచారు. భీమ్లా నాయక్ బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చారు. ఐదో షో కూడా ఓకే చేసేశారు. అందుకే, ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో పవన్ ఫ్యాన్స్ తెలంగాణ వచ్చి మరీ ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షో చూశారు.
జగన్ సర్కారు తమ అభిమాన నాయకుడి సినిమాకు అన్ని అడ్డంకులు సృష్టిస్తే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పీకేకు ఫుల్ సపోర్ట్‌గా నిలవడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక ప్రీరిలీజ్‌కు కేటీఆర్ రావడం మరింత ఎంకరేజింగ్‌గా మారింది. అందుకే, పవన్ అభిమానులు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.
హ్యాట్సాఫ్ సీఎం సార్.. అంటూ విజయవాడలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఏర్పాటు చేశారు. విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఈ భారీ ఫ్లెక్సీని పెట్టారు పీకే ఫ్యాన్స్. అంత చేసినందుకు.. ఫ్లెక్సీతో తమవంతు కృతజ్ఞత చాటుకున్నారు పవర్ స్టార్ అభిమానులు. బెజవాడలో కేసీఆర్ ఫ్లెక్సీపై సిటీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అటువైపు వెళ్లే వారంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియా గ్రూపుల్లో బాగా షేర్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి ..
- నల్గొండ జిల్లాలో కూలిన చాపర్.. పైలెట్ మృతి
- పేదల జీవితాలు మార్చినప్పుడే మాకు నిజమైన సంతృప్తి
- కేసీఆర్ పేదింటి యువతులకు మేనమామలా మారారు- మంత్రి ఎర్రబెల్లి
- వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్?
- దొంగతనం కేసులో నిందితుడికి జైలు శిక్ష
2 Comments