
క్రైమ్ మిర్రర్, అమరావతి డెస్క్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జిగ్రీ దోస్తులనే అభిప్రాయం ఉంది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఈ విషయాన్ని వాళ్లే చెప్పుకున్నారు. జగన్ తనకు తమ్ముడితో సమానమని, అతనికి అండగా ఉంటానని కేసీఆర్ ఓపెన్ గానే చాలా సార్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్ అయితే అసెంబ్లీలోనే కేసీఆర్ కు సెల్యూట్ చేశారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ మంత్రులు తరుచూ ఏపీలోని జగన్ పాలనపై విమర్శలు చేస్తుండటంతో ఇదే నిజమేననే అనుమానాలు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటన మరింత ఆసక్తిగా మారింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, ఫోటోలను కనిపించకుండా చేశారు ఏపీ సీఎం జగన్. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్, పవన్ కల్యాణ్‌ల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వంగవీటి మోహనరంగా, పవన్ కళ్యాణ్ చిత్రపాటలతో భారీ ఫ్లెక్సీలను పవన్ అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు విజయవాడలో చర్చనీయాంశంగా మారింది.ఏపీ రాజకీయాల్లో రచ్చ రాజేసిందియ
అయితే విజయవాడలోని కృష్ణలంకలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు.ఫ్లెక్సీపై మీడియాలో కథనాలు రావడంతో కార్పొరేషన్ సిబ్బందిని పంపించి ఫ్లెక్సీలను తొలగించారు. సీఎం జగన్ ఆదేశాలతోనే కేసీఆర్ ఫ్లెక్సీలను తొలగించారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై పవన్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఫోటో తొలగించిన కార్పొరేషన్ సిబ్బంది.. నగరంలో ఉన్న వైసీపీ నేతల బ్యానర్లు ,ఫ్లెక్సీలు ఎందుకు తొలగించడం లేదని మండిపడుతున్నారు. మరోవైపు తన జిగ్రీ దోస్తు అని చెప్పుకునే కేసీఆర్ ఫోటోలు విజయవాడలో కనిపించకుండా జగన్ సర్కార్ చేయడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనికి టీఆర్ఎస్ నేతల కౌంటర్లు ఎలా ఉండబోతున్నుయనే చర్చ కూడా సాగుతోంది.
ఇవి కూడా చదవండి ..
- అర్ధరాత్రి.. బస్సు వెనక సీటులో మహిళపై డ్రైవర్ అత్యాచారం!
- కాంగ్రెస్ టికెట్లపై రేవంత్ రెడ్డి సంచలనం..
- కారెక్కనున్న పీకే.. తెలంగాణలో సంచలనం?
- జగ్గారెడ్డితో కలిసి కోమటిరెడ్డి జంప్?
uNlnrbfF