
- ఇవి బహిరంగ మార్కెట్లో 8 లక్షలు ఉంటుంది
- మందమర్రి పోలీసులు, టాస్క్ ఫోర్స్ మెరుపుదాడి
- ప్రభుత్వ నిషేధిత గుట్కా ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు
క్రైమ్ మిర్రర్, చెన్నూర్/మందమర్రి : మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి యాపల్ (అబ్రహం నగర్) లో మందమర్రి, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడిచేసి 5,05,560 లక్షల రూపాయలు విలువగల ప్రభుత్వ నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్న ఘటన శనివారం వెలుగుచూసింది. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ ఏకే మహేందర్, మందమర్రి ఎస్.ఐ. లింగంపల్లి భూమేష్ లు మాట్లాడుతూ ప్రభుత్వ నిషేదిత ఉత్పత్తులు ద్వారా మనుషుల ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా క్యాన్సర్ బారిన పడుతూ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆయా ఉత్పత్తుల పై నిషేధం విధించింది పేర్కొన్నారు. అందులో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు యాపల్ అబ్రహం నగర్ లోని పిండి సురేష్ ఇంటిని ఆకస్మికంగా తనిఖీ చేయగా బారి మొత్తం లో నిషేదిత పొగాకు ఉత్పత్తుల పట్టుబడ్డాయని స్పష్టం చేశారు.
స్వాధీనం చేసుకున్న పొగాకు ఉత్పత్తులలో 31 సంచుల పూల్చాప్ (3100 ప్యాకెట్ల) విలువ 3,87,500 రూపాయలు ఉండగా, 3 సంచుల అంబార్ (300 ప్యాకెట్లు) విలువ 52,500. జే.కే జర్ధా (600 ప్యాకెట్ల) విలువ 37,800. రూపాయలు కాగా 132 షీట్లు (Baba-120 జర్థా) విలువ 27,720. రూపాయలు ఉంటుందని అని చెప్పారు. మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి లాభాపేక్ష కొరకు ఈ ప్రాంతానికి తీసుకువచ్చి అధిక ధరలకు కొంతమంది అమ్ముతున్నారని చెప్పారు. పట్టుబడిన ఉత్పత్తుల విలువ బ్లాక్ మార్కెట్ లో 8 లక్షల మేరకు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదే పని గా భావించి గుట్కా ఉత్పత్తులను తరచుగా విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఈ దాడిలో రామగుండం టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్నతో పాటు సిబ్బంది సంపత్ కుమార్, రాకేష్, శ్యాం సుందర్, శ్రీనివాస్ లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి ..
- నల్గొండ జిల్లాలో కూలిన చాపర్.. పైలెట్ మృతి
- జగన్ కు షాక్.. బెజవాడలో కేసీఆర్ క్రేజ్
- పేదల జీవితాలు మార్చినప్పుడే మాకు నిజమైన సంతృప్తి
- కేసీఆర్ పేదింటి యువతులకు మేనమామలా మారారు- మంత్రి ఎర్రబెల్లి