
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగింది. రాజధాని కీవ్ పై బాంబులు, రాకెట్లతో విరుచుకుపడుతోంది. రష్యన్ వార్ లో లక్షలాది మంది చిక్కుకుపోయారు. అందులో వేలాది మంది భారతీయులు ఉన్నారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది విద్యార్థులే. అది కూడా మెడిసిన్ స్టూడెంట్సే .ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుండటంతో అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. తమవారిని క్షేమంగా తీసుకురావాలని ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థుల కుటుంబ సభ్యులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.
ఉక్రెయిన్ లో వేలాది మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని తెలుస్తుండటంతో వాళ్లంతా ఆ దేశానికే ఉన్నత విద్య కోసం ఎందుకు వెళ్లారు అన్న చర్చ సాగుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా కాదని ఉక్రెయిన్‌కు వేలాది మంది భారతీయ విద్యార్థులు వరుస కట్టడానికి కారణం ఏంటి? అన్నది ఆసక్తిగా మారింది. ఉక్రెయిన్ లో వైద్య విద్య మనతో పోలిస్తే చాలా తక్కువ. ఉక్రెయిన్‌లో పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలతో పోల్చుకుంటే ఉక్రెయిన్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. కోర్సు ఫీజులు కూడా తక్కువగానే ఉంటాయి.
ఉక్రెయిన్‌లో వివిధ కోర్సులకు ఏడాదికి యావరేజ్ ట్యూషన్ ఫీజు ఇలా ఉంది.
మెడిసిన్ – రూ. 3,12,118
ఇంజనీరింగ్ – రూ. 1,70,922
కంప్యూటర్ సైన్స్ – రూ.1,70,922
బిజినెస్ అండ్ ఫైనాన్స్ – రూ. 1,48,628
పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు – రూ. 2,22,942
ఇక అకాండేషన్‌కి, ఫుడ్‌కి ఖర్చు అదనం. సిటీ సెంటర్‌లో ఉండే అపార్ట్‌మెంట్‌లోని సింగిల్ బెడ్‌రూం నెలకు 20వేల వరకూ ఉంటుంది. డబుల్ అయితే 30వేలు.. త్రిబుల్ అయితే 40వేలు రెంట్ ఉంటుంది. ఒక్కో ఫ్లాట్‌లో నలుగురు నుంచి ఎనిమిది మంది వరకూ విద్యార్థులు ఉంటున్నారు. అలా చూస్తే ఒక్కో స్టూడెంట్‌కి నెలకు రెంట్‌కి 5 వేలుంటే సరిపోతుంది. ఇక, సిటీ బయట ఉండే అపార్ట్‌మెంట్ రెంట్స్ చీప్‌గా ఉంటాయి. అక్కడ సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ 12వేలకే వచ్చేస్తుంది. అలాగైతే ఖర్చు మరింత తగ్గుతుంది. అంటే, దాదాపు మన హైదరాబాద్‌లో ఉండే ధరలే అక్కడా కూడా. ఇక్కడైతే లోకల్.. అదే అక్కడైతే ఫారిన్ అనే బిల్డప్.
ఉక్రెయిన్‌లో వసతి, పుస్తకాలు, యూటిలిటీ బిల్స్, ఇతర ఖర్చులు అన్నీకలిపి.. ఒక స్టూడెంట్‌కి కోర్సును బట్టి.. నెలకు 20వేల నుంచి 30వేల వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. పెద్ద నగరాలైన కీవ్, ఒడెస్సాలో వ్యయం చాలా అధికం. చిన్న నగరాలైన ఖార్కీవ్, సుమీలలో ఖర్చు చాలా తక్కువ. ఫుడ్‌కి ఒక స్టూడెంట్‌కి నెలకు సుమారు 10వేలు అవుతుందని తెలుస్తోంది.
లీటర్ పాలు రూ.42
కిలో బియ్యం రూ.74
డజన్ ఎగ్స్ రూ.75
కిలో టమాట రూ.95
అరటి పండ్లు రూ.95
1.5 లీటర్ వాటర్ బాటిల్ రూ. 30