
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన రాజ్యాంగ రక్షణ దీక్షలో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ పక్షాన దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం గురించి ఇంతటి ప్రమాదకరమైన వ్యాఖ్యలను ఎవరూ చేయలేదని అన్నారు. రాజ్యాంగమంటే కేవలం దళితులు, గిరిజనుల రిజర్వేషన్ల అంశం మాత్రమే కాదని, రాజ్యాంగం లేకపోతే రాజులు, రాజ్యాలు మాత్రమే ఉండేవని చెప్పారు. రాజ్యాంగం పనికిరాదని చెప్పిన సీఎంను తొలగిస్తే తప్ప.. రాజ్యాంగానికి గౌరవం దక్కదని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడిన మాటలు చాలా బాధకారమన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లోపాయికార ఒప్పందంతో రాజకీయ మనుగడ కోసం జిమ్మిక్కులు చేస్తున్నాయని మండిపడ్డారు. అధికారంలో ఉన్నాంకదా అని, కేసీఆర్ ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ లబ్ధి పొందడం కోసమే సీఎం కేసీఆర్ డ్రామాలడుతున్నారని అన్నారు.
ఇవి కూడా చదవండి..
- రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది?
- రష్యా వార్ ఆపే ఒక్క మొగాడు మోడీనేనట!
- క్యూ లైన్ పెద్దగా ఉంటోంది.. ఇంకో వైన్‌షాప్ కావాలని మందుబాబుల రిక్వెస్ట్