
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: హన్మకొండ జిల్లా ప్రకాష్ రెడ్డిపేటలోని గణేష్ నగర్ కు చెందిన ఎర్రబోతుల సునీల్ (23)కు దొంగతనం కేసులో ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించారు. ఈ మేరకు 7వ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సబిత శుక్రవారం తీర్పు ఇచ్చినట్టు హన్మకొండ సీఐ వేణుమాధవ్ విలేకరులకు తెలిపారు. కూడా కాలనీ, పద్మాక్షి కాలనీలోని రెండు ఇళ్లలో ఇంటి తాళం పగులగొట్టి బంగారు నగలు దొంగిలించాడు. ఈ కేసులలో కోర్టు కానిస్టేబుల్ బి.సురేష్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వప్న కోర్టులో బలమైన సాక్షుల వాంగ్మూలాలు వినిపించగా నేరం రుజువుకావడంతో నిందితునికి ఒక్కో కేసులో సంవత్సరం జైలుశిక్ష, రూ.3 వేల జరిమానా విధించారు. నిందితుడు గత సంవత్సరం కూడా దొంగతనం చేయగా.. పోలీసులు పట్టుకుని జైలుకు పంపించారు. నేరస్తుడిని పట్టుకోవడానికి కృషిచేసిన సీఐ వేణుమాధవ్, ఎస్సై రాజ్ కుమార్, కోర్టు కానిస్టేబుల్ సురేష్ ను పోలీస్ అధికారులు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
One Comment