
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. దాని ప్రభావంపై ప్రపంచ వ్యాప్తంగా పడుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంతో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. గురువారం భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర 51 వేలు దాటేసింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో పసిడి విలువ 2.02 శాతం పెరిగి.. రూ.51,396కి చేరింది. వెండి ధరలో కూడా 2 శాతం పెరుగుదల నమోదైంది. కిలో సిల్వర్ రేట్.. 65,876కు పెరిగింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. దీంతో.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు మదుపరులు. ఆ మొత్తాన్ని బంగారంపై పెడుతున్నారు. గోల్డ్ కొనుగోళ్లకు డిమాండ్ పెరగడంతో.. ధర కూడా పెరుగుతోంది. బంగారం ఒక్కటే కాదు.. ఆయిల్ కూడా బంగారమే అవుతోంది. డాలర్ విలువ సైతం పైపైకి పోతోంది. యుద్ధం ఆగే వరకూ.. బంగారం ధర మరింత ప్రియం కానుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి ..
- రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది?
- ఉక్రెయిన్ ఎయిర్ పోర్టులో కరీంనగర్ స్టూడెంట్ బిక్కుబిక్కు!
- రష్యా వార్ ఆపే ఒక్క మొగాడు మోడీనేనట!
- బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు- డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
- క్యూ లైన్ పెద్దగా ఉంటోంది.. ఇంకో వైన్‌షాప్ కావాలని మందుబాబుల రిక్వెస్ట్
2 Comments