
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కేంద్ర సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన చర్యకు ఉపక్రమించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌ను ఈడీ ముంబైలో అరెస్టు చేసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో మహా మంత్రి నవాబ్ మాలికన్ ను ఈడీ అధికారులు ఉదయం నుంచి విచారించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన ఈడీ అధికారులు.. సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టును ప్రకటించారు.
బాలీవుడ్ మెగాస్టార్ షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుపడిన తర్వాత అసలు నిందితులు కేంద్ర సంస్థ ఎన్సీపీ అధికారులేనంటూ మాలిక్ పెద్ద ఎత్తున పోరాటానికి దిగడం, ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే బదిలీ అయ్యారు. మనీ లాండరింగ్ కేసుకు సంబందించి ఇటీవల దావూద్ సోదరుడు ఇబ్రహీం కస్కర్ ను ఈడీ అరెస్టు చేసింది. విచారణలో కస్కర్ చెప్పిన విషయాల ఆధారంగా మంత్రి నవాబ్ మాలిక్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆ మేరకు బుధవారం ఉదయం విచారణ మొదలై, సాయంత్రానికి అరెస్టు జరిగింది. అయితే ఎన్సీపీ మాత్రం మాలిక్ కు ఈడీ ముందస్తు నోటీసులు ఇవ్వలేదని వాదిస్తోంది. నవాబ్ మాలిక్ పలు చోట్ల వివాదాస్పద ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అవన్నీ దావూద్, అతని అనుచరుల కోసమే మాలిక్ కొన్నట్లు ఈడీ అనుమానిస్తోంది.
Read More : కేసీఆర్ కూటమిలో ప్రకాష్ రాజ్ కీ రోల్!
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్ గా ఉన్న నవాబ్ మాలికన్ ను ఈడీ అధికారులు తీసుకెళ్లడం మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్య కూటమికి జరుగుతోన్న ప్రయత్నాల్లో ఎన్సీపీ నుంచి నవాబ్ మాలిక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మంగళవారం కీలక విషయాలు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూ ఛాన్స్ ఉండొచ్చని ఆయన హింట్ ఇచ్చారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబై పర్యటనలో ఎన్సీపీ, శివసేన అధినేతతో చర్చలోనూ కేంద్ర సంస్థల దుర్వినియోగం అంశం ప్రస్తావించారు.ఇంతలోనే నవాబ్ మాలిక్ ను ఈడీ అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.
నవాబ్ మాలిక్ వ్యవహారంలో ఈడీ, బీజేపీలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. మంత్రి హోదాలో ఉన్న నవాబ్ మాలిక్‌ను ఈడీ అధికారులు తీసుకెళ్లిన తీరు ఆక్షేపణీయమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నవాబ్ మాలిక్‌ను ఇబ్బందులకు గురి చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.,
ఇవి కూడా చదవండి ..
- బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు- డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
- క్యూ లైన్ పెద్దగా ఉంటోంది.. ఇంకో వైన్‌షాప్ కావాలని మందుబాబుల రిక్వెస్ట్
- అల్లం నారాయణకు సతీవియోగం
- భీమ్లానాయక్ ట్రైలర్ పై నెట్టింట మీమ్స్
- పల్లీలు అమ్ముకునే వ్యక్తే పాప్ సింగర్ బాప్!
- గవర్నర్ ను అవమానించడంపై కేంద్రం సీరియస్.. కేసీఆర్ కు మూడినట్టేనా?
- గంజాయి రహితంగా మార్చుదాం
- నిషేధిత గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తే సహించం- సీఐ మల్లేష్