
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఫవన్ కల్యాణ్ ఫీవర్ కనిపిస్తోంది. పవర్ స్టార్ కొత్త చిత్రం భీమ్లానాయక్ ఈనెల 25న రిలీజ్ కానుండటంతో .. ఆ సినిమాపై ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. భీమ్లా నాయక్ పై అంచనాలు భారీగా ఉండటంతో ఏ ఇద్దరు కలిసినా దానిపైనే చర్చ జరుగుతోంది. భీమ్లా నాయక్ ట్రైలర్ రావడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ట్రైలర్ విడుదల కాస్త లేటైనా ఫుల్ మీల్స్ పెట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ట్రైలర్ నిరాశపరిచిందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్‌ని ఇంత పూర్‌గా ఎలివేట్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్‌ని ఎక్కువగా నిరాశపరిచినట్లు కనిపిస్తోంది. ట్విట్టర్‌లో చాలామంది బీజీఎం బాగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. బీజీఎం అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. అసలు తమన్ మార్క్ కనిపించలేదని… బీజీఎం చాలా స్లోగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బీజీఎం చాలా ఫ్లాట్‌గా ఉందని.. ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్స్ చేశారు. మరికొందరు సినిమా మేకర్స్‌పై విరుచుకుపడ్డారు. ట్రైలర్ వాయిదా వేయడంపై ఉన్న శ్రద్ధ బీజీఎంపై పెట్టి ఉంటే బాగుండేదని కామెంట్స్ చేశారు.
ఇక భీమ్లా నాయక్ ట్రైలర్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ట్రైలర్ చూశాకా భీమ్లా నాయక్ టైటిల్ కంటే డానియెల్ శేఖర్ అనే టైటిల్ పెట్టి ఉండాల్సిందని కామెంట్ చేశాడు. ఆర్జీవీ ట్వీట్‌పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మొత్తంగా టాక్‌తో సంబంధం లేకుండా ఎప్పటిలాగే పవన్ ట్రైలర్ యూట్యూబ్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకెళ్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి ..
- బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు- డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
- క్యూ లైన్ పెద్దగా ఉంటోంది.. ఇంకో వైన్‌షాప్ కావాలని మందుబాబుల రిక్వెస్ట్
- మహారాష్ట్ర మంత్రి అరెస్ట్.. కేసీఆరే కారణమా?
- అల్లం నారాయణకు సతీవియోగం
- పల్లీలు అమ్ముకునే వ్యక్తే పాప్ సింగర్ బాప్!