
- శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్
- ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతాం
– వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్ అన్నారు. వర్థన్నపేట పీఎస్ పరిధిలోని ఇల్లంద గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నసమాచారం మేరకు 40 మంది పోలీసులతో మంగళవారం ఏసీపీ రమేష్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి, గుట్కా వంటి అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయనే అనుమానంతో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అనుమానస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. వర్ధన్నపేటను గంజాయి రహిత మండలంగా మార్చుకుందామని, ఈ బాధ్యత అందరిపై ఉందని ఏసీపీ గొల్ల రమేష్ పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులకు గంజాయి నిర్మూలన, బాల్య వివాహలు, సీసీ కెమెరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిషేధిత గుట్కా, తంబాకు అమ్మరాదన్నారు. యువత గంజాయి, చెడు వ్యసనాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. ప్రజల యొక్క శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అంశాలపై ప్రజలకు కౌన్సిలిoగ్ ఇచ్చారు. సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, పీడీ యాక్ట్ సైతం పెట్టడానికి వెనకాడమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సదన్ కుమార్, ఎస్సైలు రామారావు, మంగ, బండారి రాజు, వంశీకృష్ణ, రాజు, మాధవ్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..