
క్రైమ్ మిర్రర్, న్యూస్ డెస్క్: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి పద్మ కన్నుమూశారు. 20 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పద్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. పద్మ మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అల్లం నారాయణను సీఎం ఫోన్‌లో పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ సేవలను గుర్తు చేశారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పద్మ మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ సుఖేందర్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
- అభివృద్ధే లక్ష్యంగా ముందుకు
- గంజాయి రహితంగా మార్చుదాం
- భీమ్లానాయక్ ట్రైలర్ పై నెట్టింట మీమ్స్
- పల్లీలు అమ్ముకునే వ్యక్తే పాప్ సింగర్ బాప్!