
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: రాయపర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. ఎన్నో పనులు చేపడుతున్నా, కొందరు చిల్లెర రాజకీయాలతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారని అన్నారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినా ఊరు బాగు కోసమే పని చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు మంగళవారం రాయపర్తి మండలంలోని కోలనుపల్లి గ్రామంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున సహకారం ఉండాలన్నారు. అప్పుడే మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, స్థానిక సర్పంచ్ రాజేందర్, టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నర్సయ్య, పీఏసీఎస్ చైర్మన్ చిట్యాల వెంకన్న, ఉప సర్పంచ్ వెంకన్న, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
2 Comments