
క్రైమ్ మిర్రర్, అమరావతి : గుండెపోటుతో హఠాన్మారణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరడుగుల ఆజానుబాహుడు. హాండ్సమ్. ఫుల్ స్ట్రాంగ్‌గా ఉంటారు. రెగ్యులర్‌గా జిమ్ చేస్తుంటారు. వయసు కూడా 50 ఏళ్లే. అయినా యంగ్ గా కనిపిస్తారు. అలాంటి మేకపాటి గౌతమ్‌రెడ్డి సడెన్‌గా చనిపోవడం తీవ్రంగా కలిచివేస్తోంది. అంతటి గట్టి శరీరం ఉన్న ఆయన.. అలా ఎలా చనిపోయాడనే చర్చ నడుస్తోంది.
గౌతమ్‌రెడ్డికి మద్యం, దూమపానంలాంటి అలవాట్లు లేవంటున్నారు. వారం పాటు దుబాయ్‌లో ఉండి వచ్చారు. నెల క్రితం రెండోసారి కొవిడ్ బారిన పడ్డారు. అంతకుముందు ఓసారి కరోనా సోకింది. బయటకు చూస్తే.. హెల్దీగానే ఉన్నారు. కానీ, రెండుసార్లు కొవిడ్ అటాక్ కావడంతో.. ఇంటర్నల్‌గా బాడీ డ్యామేజ్ అయుంటుందని అంటున్నారు. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్ వల్లే ఇలా జరిగుంటుందని అంచనా వేస్తున్నారు వైద్య నిపుణులు.
Read More : బెంగళూరు ఎయిర్‌పోర్టులో రూ.9.8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
కరోనా సోకిన వారు తిరిగి కోలుకున్నా.. వారిలో రక్తం చిక్కబడటం లాంటి సమస్యలు వస్తున్నాయి. అలా రక్తం చిక్కబడితే గుండెపోటు వచ్చే అవకాశం అధికం. ప్రస్తుతం మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతోనే మరణించారని అపోలో ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి. తమ ఆసుపత్రికి వచ్చే సరికి ఆయన శరీరం స్పందించడం లేదని.. ఆయన్ను కాపాడటానికి చాలా శ్రమించినా.. ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. 50 ఏళ్ల వయసుకే హార్ట్ స్ట్రోక్ రావడం.. అదికూడా ఆరోగ్యంగా ఉండి.. రెగ్యులర్‌గా వ్యాయామం చేసే వ్యక్తికి.. ఇలా సడెన్ స్ట్రోక్ రావడానికి కారణం.. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్ కావొచ్చని అంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
- నిషేధిత గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తే సహించం- సీఐ మల్లేష్
- బైక్ పై నుంచి జారి పడి వ్యక్తి మృతి
- కేసీఆర్ కూటమిలో ప్రకాష్ రాజ్ కీ రోల్!
- కేసీఆర్ కు షాకిచ్చిన మహారాష్ట్ర సీఎం!
- నన్ను చంపేందుకు కుట్ర! ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం
- భూముల క్రమబద్దీకరణకు నేటి నుంచి దరఖాస్తులు
One Comment