
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి జారిపడి మృతిచెందాడు. ఈ సంఘటన హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నెల్ క్రాస్ రోడ్ వద్ద సోమవారం చోటుచేసుకుంది.
ఐనవోలు ఎస్సై భరత్ తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లికుంటకు చెందిన గోనెల నాగేష్ (25) s/o వెంకటేష్ TS 24 C 0854 అనే పల్సర్ బండిపై తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు బయలుదేరగా.. మార్గమధ్యలో మండలంలోని పున్నెల్ క్రాస్ రోడ్డు దాటిన తర్వాత ఒక్కసారిగా డిస్క్ బ్రేక్ వేయడం వల్ల బైక్ పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో బైక్ అతనిని 20 మీటర్ల దూరం వరకు లాగేసరికి వ్యక్తి తలకు బలమైన గాయం తగిలి నాగేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతున్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి..
- కేసీఆర్ కూటమిలో ప్రకాష్ రాజ్ కీ రోల్!
- నన్ను చంపేందుకు కుట్ర! ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం
- కేసీఆర్ కు షాకిచ్చిన మహారాష్ట్ర సీఎం!
One Comment