
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తే సహించమని ఇంతేజార్ గంజ్ సీఐ మల్లేష్ అన్నారు. వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో సోమవారం ఇంతేజార్ గంజ్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో భాగంగా రూ.లక్షా 7 వేల 500 విలువైన గుట్కా పదార్థాలను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గుట్కాను తరలిస్తున్నఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. నిందితులు గోరంటాల కిరణ్ (38) S/O కృష్ణమూర్తి, మంచిర్యాల వాసి, పోలేపాక సతీష్ (28) S/O సారయ్య కాజిపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్సై నాగరాజు, క్రైమ్ సిబ్బంది రాంరెడ్డి, వంశీ, అశోక్ లను సీఐ మల్లేష్ అభినందించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. నిషేధిత గుట్కా, ఇతర మత్తు పదార్థాల వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
- బైక్ పై నుంచి జారి పడి వ్యక్తి మృతి
- కేసీఆర్ కూటమిలో ప్రకాష్ రాజ్ కీ రోల్!
- కేసీఆర్ కు షాకిచ్చిన మహారాష్ట్ర సీఎం!
4 Comments