
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పోరాటంలో మరింత దూకుడు పెంచారు. ప్రాంతీయ పార్టీలను సమీకరించేందుకు రాష్ట్రాల బాట పట్టారు. జాతీయ రాజకీయాలపై తాను చేస్తున్న ప్రయత్నాల్లో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు సీఎం కేసీఆర్. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడల్లా ప్రకాష్ రాజ్ ను వెంట తీసుకెళుతున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలోనూ ప్రకాష్ రాజ్ ఉన్నారు.
సీఎం కేసీఆర్, ప్రకాష్ రాజ్ ఆదివారం ముంబైలో యాదృచ్ఛికంగా కలుసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ ఫ్రంట్ లో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదని అంటున్నాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రకాష్ రాజ్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ తర్వాత 2018 ఏప్రిల్ లో దేవగౌడతో సీఎం కేసీఆర్ భేటీ సందర్భంలోనూ ప్రకాష్ రాజ్ ఉన్నారు.త్వరలో సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలవనున్నారు. స్టాలిన్ తో ప్రకాష్ రాజ్ కు సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలోనూ ప్రకాష్ రాజ్ పాల్గొంటారని తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ తలపెట్టిన బీజేపీ వ్యతిరేక కూటమిలో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తిగా ప్రకాష్ రాజ్ పరిచయమే. బీజేపీ సర్కారును పలు అంశాల్లో ఆయన విమర్శించారు. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి 2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ప్రకాష్ రాజ్ ఓటమి చవిచూశారు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు.
ఇవి కూడా చదవండి..
- నిషేధిత గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తే సహించం- సీఐ మల్లేష్
- బైక్ పై నుంచి జారి పడి వ్యక్తి మృతి
- మంత్రి మేకపాటి మృతికి అసలు కారణం ఇదేనా?
- కేసీఆర్ కు షాకిచ్చిన మహారాష్ట్ర సీఎం!
- నన్ను చంపేందుకు కుట్ర! ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం
- భూముల క్రమబద్దీకరణకు నేటి నుంచి దరఖాస్తులు
2 Comments