
క్రైమ్ మిర్రర్, ములుగు(ప్రతినిధి): గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అతిపెద్ద ఆదివాసీ జాతరలో పాల్గొన్న ఆమె నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అయితే తమిళిసై పర్యటనలో మంత్రులు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులెవరూ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారెవరూ లేకపోవడంతో ములుగు ఎమ్మెల్యే సీతక్క గవర్నర్ తమిళిసైకు స్వాగతం పలికారు. ఉదయం వరకు మేడారం జాతర వద్దే ఉన్న మంత్రులు, అధికారులు గవర్నర్ రాగానే కనిపించకపోవడంపై సీతక్క విస్మయం వ్యక్తం చేశారు.
జాతరలో ఇలాంటి రాజకీయాలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. గవర్నర్ వస్తున్న విషయం తెలిసినా కలెక్టర్, ఎస్పీలు ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులతో రూపొందించిన మేడారం సావనీర్, అధికారిక కార్యక్రమాలకు తనను పిలవకున్నా జాతర సజావుగా భరించానని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి ..
- మానసిక వికలాంగురాలిపై లైంగిక వేధింపులు
- ఉచిత అంబులెన్స్ సర్వీస్ వాహనాలను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు
- సమతా క్షేత్రానికి విపక్షాలకు ఆహ్వానం ఉండదా!
- మోహన్ బాబుకు ఘోర అవమానం!
- వైసీపీలో జిల్లాల సెగ.. ఆనం, రోజా రచ్చరచ్చ!
- టీకాంగ్రెస్ కు బిగ్ షాక్.. కారెక్కనున్న ఎమ్మెల్యే!
3 Comments