
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని ప్రత్యేకంగా తయారుచేసిన శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హిందు వాహిని ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహిస్తున్న శోభా యాత్రలో పాల్గొన్నారు. ఊరేగింపు కోసం ప్రత్యేకంగా విగ్రహాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణకై కృషిచేసి, హిందూ సమాజ నిర్మాణంకై తోడ్పడిన మహిళలకు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చిన ఆ శివాజీ మహారాజ్ చూపిన బాటలో యువకులు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర బిజెపి పార్టీ ఇన్చార్జి డోకూరు పవన్ కుమార్ రెడ్డి, కొత్తకోట పిఎసిఎస్ చైర్మన్ కొట్టం వంశీధర్ రెడ్డి, సిడిసి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ జెడ్పిటిసి లు బాలమణెమ్మ, పొగాకు విశ్వేశ్వర, కౌన్సిలర్లు పార్టీల కార్యకర్తలు ప్రజలు హిందు వాహిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
- మేడారం జాతరలో అధికారుల పని తీరు భేష్
- మానసిక వికలాంగురాలిపై లైంగిక వేధింపులు
- ఉచిత అంబులెన్స్ సర్వీస్ వాహనాలను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు
- సమతా క్షేత్రానికి విపక్షాలకు ఆహ్వానం ఉండదా!
- మోహన్ బాబుకు ఘోర అవమానం!