
క్రైమ్ మిర్రర్, న్యూస్ డెస్క్: బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో సుమారు రూ.9.8 కోట్ల విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులోని కార్గో సెక్షన్ దగ్గరద బెడ్‌షీట్లు, మిషన్ విడిభాగాల్లో దాచి ఉంచిన ఎక్స్టసీ మాత్రలు, హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నైజిరియన్ వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న నిందితులపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. సరుకుల రూపంలో డ్రగ్స్‌ను జాంబీయా, బెల్జియం నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న కిలో హెరాయిన్ సుమారు రూ.7కోట్లు, 4.551 కిలోల ఎక్స్టసీ మాత్రలు దాదాపు రూ.3కోట్ల విలువ ఉంటుందని అంచనా.
ఇవి కూడా చదవండి..
- పాఠశాలలను రాజకీయ కార్యక్రమాల కోసం వాడుకోవద్దు
- మేయర్ ప్రమీలా పాండే పై ఎఫ్ఐఆర్ నమోదు
- తప్పును తప్పించుకునేందుకు లక్షల్లో ఖర్చు! నల్గొండ జిల్లాలో ఓ ఎస్ఐ బాగోతం..
2 Comments