
క్రైమ్ మిర్రర్, న్యూస్ డెస్క్: త్రిపుర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాలలను గానీ, పాఠశాల మైదానాలను గానీ రాజకీయ కార్యక్రమాలకు వినియోగించడంపై నిషేధం విధించింది. ఇకపై పాఠశాలలను, పాఠశాలల మైదానాలను రాజకీయ కార్యక్రమాల కోసం వాడుకోవద్దని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈ కొత్త నిబంధన ప్రకారం ఇతర కార్యక్రమాల నిమిత్తమై వాడుకోవడానికి సంబంధిత పాఠశాల శాఖ నుంచి ఎన్ఓసీ సర్టిఫికేట్‌ను పొందాల్సి వుంటుందని పేర్కొంది.
అది కూడా.. పాఠశాలలకు సెలవులు ఉన్న రోజుల్లో మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కొందరు ప్రధానోపాధ్యాయులు ఎన్‌వోసీ సర్టిఫికేట్ లేకుండానే రాజకీయ కార్యక్రమాలకు అనుమతులిచ్చారని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వారందరూ నియమాలను ఉల్లంఘించినట్లేనని పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
- తప్పును తప్పించుకునేందుకు లక్షల్లో ఖర్చు! నల్గొండ జిల్లాలో ఓ ఎస్ఐ బాగోతం..
- చినజీయర్ పై కేసీఆర్ రివేంజ్!
- మేయర్ ప్రమీలా పాండే పై ఎఫ్ఐఆర్ నమోదు
- జగ్గారెడ్డి జగడం ఎందుకు.. రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు?
One Comment