
క్రైమ్ మిర్రర్, నిఘా డెస్క్ : సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు. ఇది పోలీసు బాస్ లు చెప్పేమాట. పలు సార్లు కోర్టులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. సివిల్ వివాదాల్లో తలదూర్చిన కొందరు అధికారులపై చర్యలు తీసుకుంది. కాని క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ మరోలా ఉంది. భూవివాదాల్లో తల దూర్చుతున్న పోలీసు అధికారులు.. లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాసుల కోసం అక్రమార్కులకు వంత పాడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. నల్గొండ జిల్లా కట్టంగూరులో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న ఎస్ఐ… ఓ రైతుపై ప్రతాపం చూపించాడు. బెల్ట్ తో రక్తం వచ్చేలా కొట్టాడు. అవతలి వ్యక్తి నుంచి భారీగా డబ్బులు తీసుకున్న ఎస్ఐ.. రైతును ఇష్టారీతంగా కొట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.
కట్టంగూరు మండలం కలిమేర గ్రామానికి చెందిన వీరయ్య తండ్రి దశాబ్దాల క్రితమే ఎల్లమ్మ దగ్గర భూమి కొన్నారు. 40 ఏళ్ల క్రితం గ్రామ పెద్ద మనుషుల సాక్షిగా ఈ కొనుగోలు జరిగింది. కాని పట్టా చేసుకోలేదు. 40 ఏళ్లుగా వీరయ్య కుటుంబమే ఆ భూమిని సాగు చేస్తోంది. అయితే ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన దరణిలో ఎలమ్మ పేరుపైనే భూమి వచ్చింది. దీంతో గ్రామ పెద్దలను కలిసిన వీరయ్య.. గతంలోనే కొనుగోలు చేసినందున పట్టా చేయాలని కోరాడు. దీంతో మరో లక్ష రూపాయలు ఇచ్చి పట్టా చేసుకోవాల్సింది పెద్ద మనుషులు చెప్పారు. దీంతో ఎలమ్మకు లక్ష రూపాయలు ఇచ్చి రెండు నెలల క్రితం 27 గుంటల భూమిని పట్టా చేసుకున్నాడు వీరయ. రిజిస్ట్రేషన్ కు ఎల్లమ్మతో పాటు ఆమె కొడుకు కూడా వచ్చాడు. ఎమ్మార్వో కార్యాలయంలోనే ఇది జరిగింది.
కాని రిజిస్ట్రేషన్ అయిన రెండు నెలల తర్వాత గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల ప్రోత్సాహంతో మాట మార్చింది ఎలమ్మ. తనను బెదిరింది భూమి పట్టా చేసుకున్నారని వీరయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలేం జరిగిందో విచారించకుండానే వీరయ్యను స్టేషన్ కు పిలిపి వీరంగం వేశాడు కట్టంగూర్ ఎస్ఐ. బెల్ట్ తో అడ్డగోలుగా కొట్టాడు. ఎస్ఐ కొట్టడంతో వీరయ్యకు తీవ్ర గాయాల్యయాయి. ఎలమ్మకు మద్దతుగా కొందరు ఎస్ఐ భారీగా డబ్బులు ఇచ్చారని, అందుకే అతను వీరయ్యను కొట్టాడని చెబుతున్నారు. వీరయ్య చెప్పేది వినకుండా ఎస్ఐ కొట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎమ్మార్వో కార్యాలయంలో జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ బలవంతంగా ఎలా జరుగుతుందని వీరయ్య చెబుతున్నారు. ఎమ్మార్వో కార్యాలయంలో వివరాలు తీసుకున్న ఎస్ఐకి అసలు నిజాలు తెలిసేవన్నారు. ఎలమ్మతో పాటు కొడుకు కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు వచ్చారని, ఇక్కడ బలవంతం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నిస్తున్నారు. దరణి ద్వారా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉండదని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. డబ్బులు లంచంగా తీసుకున్న ఎస్ఐ.. తన పరిధిని దాటి వీరయ్యపై ఓవరాక్షన్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
Read more : సీతక్క ఆవేదన.. జాతర వద్దే ఉన్న మంత్రులు గవర్నర్ రాగానే గాయబ్
వీరయ్యను అకారణంగా కొట్టారనే విషయం రావడంతో ఎస్ఐ మరో డ్రామాకు తెర తీశాడు. 80 ఏళ్ళ వృద్ధురాలికి కరోనా టెస్టులు చేయిస్తానని నమ్మించి ఎమ్మార్వో కార్యాలయానికి తీసుకెళ్లిన వీరయ్య అనే చీటర్.. భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా సీన్ మర్చాడు. ఆ విధంగానే ఎల్లమ్మ పిర్యాదు తీసుకుని.. అప్పటికప్పుడే వీరయ్యపై చీటింగ్ కేసు నమోదు చేశాడు. జ్వరము తో బాద పడుతున్న ఎల్లమ్మను.. అదే గ్రామానికి చెందిన బెల్లి వీరయ్య వచ్చి, ఆమెతో నిన్ను హాస్పిటల్ లో చూపిస్తానని, కరోనా టెస్ట్ చేపిస్తానని చెప్పి తహశీల్దార్ ఆఫీసు కి తీసుకెళ్లి , ఆమె పేరు పై గల 27 గుంటల భూమిని తన పేరుపై రిజిస్టర్ చేసుకున్నాడని కేసు ఫైల్ చేశాడు. ఈ విధంగానే స్థానికంగా మీడియా ప్రతినిధులతో మేనేజ్ చేయించాడు. ఇందుకోసం కట్టంగూరు ఎస్ఐ లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడని తెలుస్తోంది. వీరయ్యకు తీవ్ర గాయాలు కావడం, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు రావడంతో.. తన ఉద్యోగానికి ఎసరు వస్తుందనే భయంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సీన్ మార్చేశారని చెబుతున్నారు.
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ కు గండం.. కేసు నమోదుకు ఈసీ ఆదేశం
అసలు సివిల్ వివాదంలో ఎస్ఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు. సివిల్ వివాదంలో తలదూర్చి అకారణంగా రైతును చితకబాదిన ఎస్ఐని సస్సెండ్ చేయాలని వీరయ్య బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి …
- చినజీయర్ పై కేసీఆర్ రివేంజ్!
- కారు నదిలో పడి 9 మంది సజీవ సమాధి
- మేయర్ ప్రమీలా పాండే పై ఎఫ్ఐఆర్ నమోదు
- కేసీఆర్ కు కామ్రెడ్ల షాక్.. కొత్త ఫ్రంట్ అసాధ్యమేనా?
- జగ్గారెడ్డి జగడం ఎందుకు.. రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు?
One Comment