
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి కల్లోలం రేపారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన రాజీనామా ప్రకటన గాంధీభవన్ లో సెగలు రేపుతోంది. పార్టీ సీనియర్లు అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ను ఇంటికి పంపడమే లక్ష్యంగా పోరాడుతున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇది చాలా ఇబ్బందికర పరిస్థితిగా మారింది. గతంలోనూ జగ్గారెడ్డి ఇదే విధంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డారు. నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా వచ్చినప్పటి నుంచి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జగ్గారెడ్డి ఇంకొందరు సీనియర్ నాయకులు ఏదో విధంగా రేవంత్ రెడ్డిని బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డిని బద్నాం చేసేందుకు సీనియర్ నాయకులు ఎవరి పంథాలో వారు పావులు కదుపుతున్నారు. రేవంత్ రెడ్డిని తాను తన నాయకుడిగా గుర్తించడం లేదని చెప్పకనే చెప్పారు జగ్గారెడ్డి
రెండు మూడు రోజుల క్రితమే కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సంధి కుదిరిన నేపధ్యంలో జగ్గా రెడ్డి, మళ్ళీ ఇప్పుడు ఈ వివాదాన్ని తెరమీదకు తేవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన పాత్రధారి జగ్గారెడ్డి ఒక్కరే అయినా సూత్రదారులు వేరే ఉన్నారని పార్టీలోనే చర్చజరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, బహిరంగంగా ప్రకటించిన జగ్గారెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో వాడిన పదాలు, పార్టీ నుంఛి తనంతట తానూ బయటకు పోవడం కాకుండా,పార్టీనే వేటు వేసి బయటకు పంపాలని కోరుకుంటున్నట్లుగా ఉందని, అయినా పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకపోతే అది పార్టీ బలహీనతకు అద్దం పడుతుందని పార్టీ నాయకులే అంటున్నారు. నిజానికి జగ్గారెడ్డి కోరుకుంటున్నది కూడా అదే.. అందుకే ఆయన సొనియా గాంధీకి రాసిన లేఖలో ఇక నుంచి తాను కాంగ్రెస్ గుంపు లో లేనని పేర్కొన్నారు. అంటే, తాను కాంగ్రెస్ పార్టీని ఒక పార్టీలా కాకుండా గుంపులా చూస్తున్నానని చెప్పకనే చెప్పారు.
అంతే కాదు ఈ అంతటికీ రేవంత్ రెడ్డి కారణమని పరోక్షంగా చెప్పేందుకు ప్రత్యక్ష ఆరోపణలు చేశారు. సొంత పార్టీలోనే కుట్ర చేసి కోవర్టుగా ముద్రవేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌లో హుందాతనం లేదన్నారు. రేవంత్ రెడ్డి డబ్బులిచ్చి పీసీసీ చీఫ్ సొంతం చేసుకున్నారని తెరాస చేస్తున్న ఆరోపణలకు ఊతం ఇచ్చేలా లాబీయింగ్ ద్వారా కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ అవ్వొచ్చని విమర్శించారు. అయితే పార్టీని వీడినా గాంధీ కుటుంబానికి విధేయంగా ఉంటానని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే జగ్గారెడ్డి, ఏదో ఆషామాషిగా ఈ తాజా వివాదానికి తెర తీయలేదని, పకడ్బందీ వ్యూహంతోనే రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గానే ఈ ఆరోపణలు చేశారని అంటున్నారు.
అయితే జగ్గారెడ్డి రాజీనామా ప్రకటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూల్ గా స్పందించారు. ఇది పార్టీలో అంతర్గత వ్యవహారమని , అంతా సర్దుకుంటుందని చెప్పారు. జగ్గారెడ్డి ఎపిసోడ్ ను టీ కప్పులో తుపానులా అభివర్ణించారు రేవంత్ రెడ్డి. సోనియాకు లేఖ రాసి పరోక్షంగా తనను టార్గెట్ చేసిన జగ్గారెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి కూల్ గా ఉండటం ఆసక్తిగా మారింది. జగ్గారెడ్డి తీరును కొంత కాలంగా గమనిస్తున్న రేవంత్ రెడ్డి.. ఈ పరిమామాలను ముందే ఊహించారని ఆయన అభిమానులు అంటున్నారు. చాలా కాలంగా గులాబీ పెద్దలతో జగ్గారెడ్డి టచ్ లో ఉన్నారన్నది రేవంత్ వర్గీయుల వాదన. కేటీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని వాళ్లు చెబుతున్నారు. జగ్గారెడ్డికి కౌంటర్ వ్యూహం రేవంత్ రెడ్డి దగ్గర సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి ..
- సీతక్క ఆవేదన.. జాతర వద్దే ఉన్న మంత్రులు గవర్నర్ రాగానే గాయబ్
- ఎమ్మెల్యే రాజాసింగ్ కు గండం.. కేసు నమోదుకు ఈసీ ఆదేశం
- యువతకు ఆదర్శం చత్రపతి శివాజీ మహారాజ్ .. ఎమ్మెల్యే ఆల
- మానసిక వికలాంగురాలిపై లైంగిక వేధింపులు
- సమతా క్షేత్రానికి విపక్షాలకు ఆహ్వానం ఉండదా!
One Comment