
క్రైమ్ మిర్రర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కోటా దగ్గర కారు అదుపుతప్పి నదిలో పడింది. కారులో ప్రయాణిస్తున్న తొమ్మిదిమంది అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. ఉజ్జయినీలో జరుగుతున్న వివాహ వేడుకకు తొమ్మిది మంది ఓ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో కోట వద్ద చంబల్ నది దాటుతుండగా అదుపుతప్పి అందులో పడిపోయింది. దీంతో అందులో ఉన్న తొమ్మిది మంది మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలికి చేరుకొని, క్రేన్ సహాయంతో కారును నదిలో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
- సీతక్క ఆవేదన.. జాతర వద్దే ఉన్న మంత్రులు గవర్నర్ రాగానే గాయబ్
- ఎమ్మెల్యే రాజాసింగ్ కు గండం.. కేసు నమోదుకు ఈసీ ఆదేశం
- జగ్గారెడ్డి జగడం ఎందుకు.. రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు?
One Comment