
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే ఆరోపణలపై హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అంతేకాదు యూపీలో రాజా సింగ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఈసీ నిషేధించింది.బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాబోయే 72 గంటల పాటు ఎన్నికల సభలు, సమావేశాలు, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఈసీ నిషేధం విధించింది.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఓటు వేయనివారి ఇళ్లను కూల్చడానికి జేసీబీలు, బుల్డోజర్ల సిద్ధంగా ఉన్నాయంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇటీవల హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశించినా, రాజాసింగ్ ప్రతిస్పందించలేదు. దీంతో ఆయపై కేసు నమోదుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇటీవల విడుదల చేసిన వీడియో వివాదాస్పదమైంది. యూపీలో యోగికి, బీజేపీకి ఓటు వేయకపోతే బుల్డోజర్లతో తొక్కించేస్తామని రాజా సింగ్ ఓటర్లను బెదిరించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రాజా సింగ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఐపీసీ, ఆర్‌పీ చట్టం, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కానీ గడువులోగా ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో చివరికి కేసు నమోదుకు ఆదేశాలు వెలువడ్డాయి.
ఇవి కూడా చదవండి ..
- సమతా క్షేత్రానికి విపక్షాలకు ఆహ్వానం ఉండదా!
- మోహన్ బాబుకు ఘోర అవమానం!
- వైసీపీలో జిల్లాల సెగ.. ఆనం, రోజా రచ్చరచ్చ!
- టీకాంగ్రెస్ కు బిగ్ షాక్.. కారెక్కనున్న ఎమ్మెల్యే!
- బండిపైనే కేసీఆర్ పోటీ? గులాబీ స్కెచ్ ఇదేనా..
- నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్ల పట్టివేత
2 Comments